Moto G67 Power 5G : మోటోరోలా తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మోటో జి 67 పవర్ ఈరోజు లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 15 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లేటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు సరికొత్త కలర్ ఆప్షన్స్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పియా ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Moto G67 Power 5G : ప్రైస్
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 15,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్ నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది. SBI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ పై రూ . 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లేదా ఈ ఫోన్ ఎక్స్చేంజ్ పై రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్స్ ఈ ఫోన్ పై అందించింది.
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ సెట్ తో జతగా 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 16 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ మరియు కలర్ బూస్ట్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ మోటోరోలా యొక్క హలో UX బేస్డ్ ఆండ్రాయిడ్ 15 OS పై పని చేస్తుంది. ఈ ఫోన్ MIL-810H మిలిటరీ గ్రేడ్ రక్షణ కలిగిన డిజైన్ మరియు IP 64 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో ఉంటుంది.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ లో 4K వీడియో సపోర్ట్ కలిగిన కెమెరాలతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో వెనుక 50MP సోనీ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో డాల్బీ అట్మాస్ మరియు Hi-Res ఆడియో సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile