Lava Agni 4 లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసింది.!

HIGHLIGHTS

Lava Agni 4 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు లావా అనౌన్స్ చేసింది

లాంచ్ డేట్ మరియు డిజైన్ తో పటు ఇతర వివరాలు అందించింది

ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కూడా క్లియర్ అయ్యింది

Lava Agni 4 లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసింది.!

Lava Agni 4 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు లావా అనౌన్స్ చేసింది. అగ్ని 4 స్మార్ట్ ఫోన్ కోసం నిన్నటి వరకు కేవలం కమింగ్ సూన్ పేరుతో టీజింగ్ చేసిన లావా, ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు డిజైన్ తో పటు ఇతర వివరాలు అందించింది. ఈ ప్రముఖ ఇండియన్ బ్రాండ్ లాంచ్ చేయనున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు వివరాలు ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Agni 4 : లాంచ్ డేట్

లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 20వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు డిజైన్ మరియు వివరాలు తెలిపే టీజర్ ఇమేజ్ లను కూడా విడుదల చేసింది.

Lava Agni 4 : ఫీచర్స్

లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ కెమెరా మరియు సైడ్ డిజైన్ వెల్లడించే కొత్త టీజర్ ఇమేజ్ లను లావా విడుదల చేసింది. ఈ కొత్త టీజర్ లతో ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఇమేజస్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతున్నట్లు వ్యక్తం అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక పై భాగంలో అడ్డంగా పిల్ షేప్ లో కెమెరా ఉన్నట్లు క్లియర్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కూడా క్లియర్ అయ్యింది.

ఈ ఫోన్ లో మీడియాటెక్ ప్రోసెసర్ ఉన్నట్లు ఇమేజ్ రివీల్ చేసింది. అయితే, ఈ చిప్ సెట్ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ చిప్ సెట్ ని గెస్ చేయండి అని టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ పై వచ్చిన లీక్స్ కనుక నిజం అయితే ఈ ఫోన్ Dimensity 8350 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, దీనికి జత LPDDR5X ర్యామ్ మరియు ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Lava Agni 4

ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో లేటెస్ట్ ఐఫోన్ లో అందించిన ప్రత్యేకమైన కెమెరా బటన్ లాంటి ఒక బటన్ కనిపిస్తుంది. ఒకవేళ ఇది మనం ఊహించినట్టు కెమెరా కోసం అందించిన ప్రత్యేకమైన బటన్ కనుక అయితే, ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సిస్టం మరియు ఫీచర్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం సిగ్నల్ యాంటెన్నా మరియు ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది.

Also Read: Aadhaar New Rules: మీ ఆధార్ లో వివరాలు తప్పుగా ఉంటే మీ ఫోన్లోనే సరి చేసుకోండి.!

ఈ ఫోన్ పై వచ్చిన లీక్స్ ద్వారా ఈ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఇందులో ఇన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బరి 700 mAh బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ కంపెనీ
బయటకు వెల్లడించే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo