Aadhaar New Rules: మీ ఆధార్ లో వివరాలు తప్పుగా ఉంటే మీ ఫోన్లోనే సరి చేసుకోండి.!
భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఆధార్ కార్డును కలిగి ఉండటం తప్పనిసరి
UIDAI మొబైల్ ఫోన్ లో ఆధార్ ని అప్డేట్ చేసుకునే అవకాశం యూజర్లకు అందింది
ఆధార్ కార్డు అప్డేట్ కోసం UIDAI కొత్త అప్డేట్ మరియు కొత్త రూల్స్ డెవలప్ చేసింది
Aadhaar New Rules: భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఆధార్ కార్డును కలిగి ఉండటం తప్పనిసరి. అలాంటి ఆధార్ కార్డు లో ఏదైనా తప్పులు ఉంటే బ్యాంక్ అకౌంట్ మొదలుకొని పాన్ కార్డు తో పాటు ప్రభుత్వం అందించే ప్రయోజనాల వరకు పొందడం దాదాపు అసాధ్యం అవుతుంది. అందుకే, ఆధార్ కార్డు సరైన వివరాలను కలిగి ఉండటం తప్పనిసరి అవుతుంది. అయితే, అనుకోకుండా ఆధార్ కార్డులో తప్పులు దొర్లినట్లయితే దాన్ని సరి చేయించుకోవడానికి ఇప్పటివరకు ఆధార్ సెంటర్ ని సంప్రదించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు UIDAI అందించిన కొత్త సౌలభ్యం తో ఇంటి వద్ద కూర్చొని మొబైల్ ఫోన్ లో ఆధార్ ని అప్డేట్ చేసుకునే అవకాశం యూజర్లకు అందింది.
SurveyAadhaar New Rules:
ఆధార్ కార్డు అప్డేట్ కోసం UIDAI కొత్త అప్డేట్ మరియు కొత్త రూల్స్ డెవలప్ చేసింది. ఇప్పటి వరకు కేవలం ఆధార్ సెంటర్ లో మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి వీలున్న పేరు, డేట్ అఫ్ బర్త్ మరియు అడ్రస్ వంటి వివరాలు ఇప్పుడు యూజర్లు నేరుగా అప్డేట్ చేసుకొనే అవకాశం అందించింది. mAadhaar App లేదా మై ఆధార్ పోర్టల్ ద్వారా యూజర్లు వారి పేరు లేదా అడ్రస్ వంటి వివరాలు స్వయంగా సరిచేసుకోవచ్చు. అయితే, ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కాన్, ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ కోసం మాత్రం కచ్చితంగా ఆధార్ సెంటర్లను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.

ముందుగా ఉన్న డెమోగ్రాఫిక్ అప్‌డేట్ ఫీజును మాత్రం 75% రూపాయలకు పెంచింది. అలాగే, బయోమెట్రిక్ అప్డేట్ ఫీజును కూడా రూ. 125 రూపాయలకు సెట్ చేసింది. అయితే, పిల్లల వయసు పరంగా చేసే అప్డేట్ ను ఉచితంగా చేసుకునే వెసులుబాటు కల్పించింది.
కొత్త అప్డేట్ తో ఏ వివరాలు సరి చేసుకోవచ్చు?
ఆధార్ కొత్త అప్డేట్ తో పేరు, చిరునామా (Address), పుట్టిన తేదీ (Date of Birth), మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ID వంటి వాటి వివరాలు సరి చేయడం లేదా అప్డేట్ చేసుకునే వీలుంటుంది.
Also Read: Jio జబర్దస్త్ ఆఫర్: యూజర్లకు Gemini Pro ఉచితంగా ప్రకటించిన జియో.!
మొబైల్ ద్వారా ఎలా చేయాలి?
ముందు మీ ఫోన్ లో mAadhaar App డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ మరియు ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వండి. తర్వాత ఈ యాప్ లో “Update Aadhaar” బటన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీరు అప్డేట్ లేదా సరి చేయదలచిన వివరాలు అందించండి. దానికి తగిన అవసరమైన డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయండి. తర్వాత పేమెంట్ చెల్లించి సబ్మిట్ చేయండి. మీ అప్డేట్ పరిశీలించి వివరాలు అన్ని సక్రమంగా ఉంటే కొత్త ఆధార్ 30 రోజుల్లో మీకు ఆధార్ కార్డ్ అడ్రస్ కి అందించబడుతుంది. లేదంటే మీరు ఆన్లైన్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇదే విధంగా ఆన్లైన్ల్ లో మై ఆధార్ పోర్టల్ ద్వారా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం myaadhaar.uidai.gov.in పోర్టుల ఓపెన్ చేసి “Update Aadhaar Online” క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ద్వారా OTP తో లాగిన్ అవ్వండి. అడిగిన వద్ద మీ వివరాలు అందించి, పేమెంట్ చెల్లించండి. మొట్ట వివరాలు సరి చూసుకోండి మరియు సబ్మిట్ చేయండి.