BSNL Bharat Connect 26 Plan తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం నిశ్చింతగా ఉండొచ్చు.!
BSNL Bharat Connect 26 Plan తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం నిశ్చింతగా ఉండొచ్చు
ఈ ప్లాన్ డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలు అందిస్తుంది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ముగిసే లోపుగా ఈ ప్లాన్ అందించే లాభాలు అందుకోండి
BSNL Bharat Connect 26 Plan తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలు అందిస్తుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రెగ్యులర్ గా అందించిన ప్లాన్ కాదు. కొత్త సంవత్సరం 2026 సందర్భంగా కేవలం నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉండేలా అందించిన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. అందుకే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ముగిసే లోపుగా ఈ ప్లాన్ అందించే లాభాలు అందుకోండి.
SurveyBSNL Bharat Connect 26 Plan
ఇది బిఎస్ఎన్ఎల్ రీసెంట్ గా అందించిన అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ మరియు ఇది వన్ ఇయర్ చెల్లుబాటు అవుతుంది. ఇది పేరుకు తగ్గట్టు కొత్త సంవత్సరాన్ని సూచించేలా చాలా బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రూ. 2,626 రూపాయల రీఛార్జి తో వస్తుంది. ఇది అధిక డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ రూ. 2,626 ప్లాన్ బెనిఫిట్స్
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 2,626 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా సంవత్సరం చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ అందిస్తుంది. ఇదే కాదు, డైలీ 2.6 జీబీ హై స్పీడ్ డేటా మరియు ఈ హై స్పీడ్ ఈటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగం తో అన్లిమిటెడ్ డేటా సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది. ఇది కాకుండా డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా ఈ ప్లాన్ తో యూజర్లు పొందుతారు. అయితే, ఇది కేవలం లిమిటెడ్ పీరియడ్ కాలానికి అందుబాటులో ఉండే ప్లాన్ మాత్రమే అని గుర్తుంచుకోండి.

ఈ ప్లాన్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది?
బిఎస్ఎన్ఎల్ రూ. 2,626 ప్లాన్ కొత్త సంవత్సరం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ప్రత్యేకమైన ఆఫర్ గా అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ కేవలం 24 ఫిబ్రవరి 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే, ఇంకా 15 రోజులు మాత్రమే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది. ఈ బిఎస్ఎన్ఎల్ భారత్ కనెక్ట్ 26 ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం అధికమైన అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు.
Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చెల్లించే మొత్తం అమౌంట్ ను 12 నెలలకు లెక్క కడితే నెలకు కేవలం రూ. 218 రూప్యాలు మాత్రమే అవుతుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile