Lava Agni 4 లాంచ్ కంటే ముందే కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
లావా ఈసారి ప్రీమియం సెగ్మెంట్ పై కన్నేసినట్లు కనిపిస్తోంది
లావా అగ్ని 4 ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు అందరికీ తెలిసేలా చేసింది
ఈ ఫోన్ హ్యాండ్ ఆన్ వీడియోలు కూడా ఇప్పుడు X ప్లాట్ ఫామ్ నుంచి వైరల్ అవుతున్నాయి
Lava Agni 4: ఇండియన్ బెస్ట్ మొబైల్ తయారీ కంపెనీ లావా ఈసారి ప్రీమియం సెగ్మెంట్ పై కన్నేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లావా అగ్ని స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు అందరికీ తెలిసేలా చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ హ్యాండ్ ఆన్ వీడియోలు కూడా ఇప్పుడు X ప్లాట్ ఫామ్ నుంచి వైరల్ అవుతున్నాయి.
SurveyLava Agni 4 : న్యూ అప్‌డేట్
లావా ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే గురించి వివరాలు వెల్లడించింది. లావా అగ్ని 4 ఫోన్ లో 1.5K రిజల్యూషన్ కలిగిన 6.67 ఇంచ్ ఫ్లాట్ AMOLED స్క్రీన్ ఉందని లావా అనౌన్స్ చేసింది. ఇది ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అధిక బ్రైట్నెస్ మరియు అధిక రిఫ్రెష్ రేట్ తో మంచి గేమింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో, 100 కంటే ఎక్కువ షార్ట్ కట్ కాంబినేషన్స్ కలిగిన ప్రత్యేకమైన యాక్షన్ కి ఉంటుంది. ఇది ఫోన్ కుడివైపు దిగువ భాగంలో ఉంటుంది. ఇది కెమెరా బటన్, టోగుల్ వైబ్రేషన్, టార్చ్ ఆన్ మరియు యాప్ లాంచ్ వంటి 100 కంటే ఎక్కువ పనులు సింగిల్ టచ్ తో చేస్తుంది.

ప్రముఖ టిప్స్టర్ ముకుల్ శర్మ ఈ ఫోన్ ఫీచర్స్ తో పాటు హ్యాండ్ ఆన్ ఫోటోస్ కూడా తన X అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ బయటకు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా 60FPS వద్ద 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: ఈరోజు 25 వేల బడ్జెట్ లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ Smart Tv డీల్స్ పై ఒక లుక్కేయండి.!
ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్ జతగా 8 జీబీ LPDDR5X ర్యామ్ మరియు UFS 4.0 256 జీబీ ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Vayu AI ఫోటో ఎడిటర్ ని లావా అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో సరికొత్త AI స్మార్ట్ పెట్ (వాయు) ఫీచర్ కూడా అందించింది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ నవంబర్ 20వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది.