Lava AGNI 3: సరికొత్త డిజైన్, స్టన్నింగ్ కెమెరా మరియు కష్టమైజబుల్ యాక్షన్ బటన్ తో వస్తోంది.!

HIGHLIGHTS

Lava AGNI 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్ ను లావా అనౌన్స్ చేసింది

అగ్ని 2 5జి ఫోన్ యొక్క నెక్ట్స్ జనరేషన్ ఫోన్ గా దీన్ని తీసుకువస్తున్నట్లు Lava చెబుతోంది

కస్టమైజబుల్ యాక్షన్ బటన్ మరియు 50MP OIS కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి

Lava AGNI 3: సరికొత్త డిజైన్, స్టన్నింగ్ కెమెరా మరియు కష్టమైజబుల్ యాక్షన్ బటన్ తో వస్తోంది.!

Lava AGNI 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్ ను లావా అనౌన్స్ చేసింది. బడ్జెట్ ధరలో 3D కర్వుడ్ స్క్రీన్ తో లావా చరిత్ర సృష్టించిన అగ్ని 2 5జి ఫోన్ యొక్క నెక్ట్స్ జనరేషన్ ఫోన్ గా దీన్ని తీసుకువస్తున్నట్లు చెబుతోంది. ఈ అప్ కమింగ్ లావా స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన కస్టమైజబుల్ యాక్షన్ బటన్ మరియు 50MP OIS కెమెరా సెటప్ వంటి మరిన్ని ఫీచర్స్ తో మార్కెట్ లో విడుదల కావడానికి ఈ ఫోన్ సిద్ధం గా ఉందని లావా చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava AGNI 3: లాంచ్

లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో విడుదల చేస్తుందని లావా తెలిపింది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను అమెజాన్ కేవలం అమెజాన్ నుంచి మాత్రమే సేల్ చేస్తుందని కూడా ప్రకటించింది.

Lava AGNI 3: కీలకమైన ఫీచర్స్

లావా అగ్ని 3 స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను లావా బయట పెట్టింది. ఈ అప్ కమింగ్ లావా స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకమైన కస్టమైజబుల్ యాక్షన్ బటన్ తో లాంచ్ చేస్తునట్లు ప్రకటించింది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుందని కూడా లావా గొప్పగా చెబుతోంది.

Lava AGNI 3 Launch

ఈ ఫోన్ లోకి వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా ఉంది మరియు దానికి జతగా మరో రెండు కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ మరియు కర్వుడ్ డిజైన్ ను కలిగి వుంది.

Also Read: Sony Smart Tv పై బిగ్ డీల్ అందించిన అమెజాన్ ఇండియా: GIF సేల్ ఆఫర్ పై ఒక లుక్కేయండి.!

భారత్ లో ఇప్పటికే పెరుగుతున్న కర్వుడ్ స్క్రీన్ ఫోన్స్ మరియు కొత్త ఫీచర్స్ తో వస్తున్నా కొత్త ఫోన్ లకు పోటీగా ఈ ఫోన్ లను లావా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ నాటికి మరిన్ని ఫీచర్స్ ను లావా విడుదల చేసే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo