అమెజాన్ సేల్ నుంచి Lava Agni 3 5G భారీ ఆఫర్స్ తో సేల్ మొదలయ్యింది.!
Lava Agni 3 5G అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ తో సేల్ అవుతోంది
ఈ ఫోన్ 20 వేల బడ్జెట్ లో డ్యూయల్ స్క్రీన్ మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది
ఈ కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరింత తక్కువ ధరకు లభిస్తుంది
Lava Agni 3 5G స్మార్ట్ ఫోన్ రెండు రోజుల క్రితం మార్కెట్ లో విడుదలయ్యింది. ఈ లావా కొత్త స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ 20 వేల బడ్జెట్ లో డ్యూయల్ స్క్రీన్ మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. అయితే, అమెజాన్ అందించిన ఆఫర్స్ తో ఈ కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరింత తక్కువ ధరకు లభిస్తుంది.
SurveyLava Agni 3 5G: ప్రైస్
లావా ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది. ఇందులో ఛార్జర్ కలిగిన మరియు చార్జర్ లేకుండా కూడా కూడా వేరియంట్లను అందించింది. ఈ వేరియంట్స్ ప్రైస్ విషయానికి వస్తే, ఈ ఫోన్ యొక్క బేసిక్ 8GB + 128GB (చార్జర్ లేకుండా) వేరియంట్ కేవలం రూ. 20,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB (చార్జర్ కలిగిన) వేరియంట్ ధర రూ. 22,999. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ 8GB + 256GB వేరియంట్ రూ. 24,999 ధరతో వచ్చింది.
అమెజాన్ సేల్ ఆఫర్స్
ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు మంచి బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ తో లభిస్తోంది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ డెబిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 19,999 రూపాయల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. Buy From Here
Also Read: జబర్దస్త్ టీవీ ఆఫర్: కేవలం 8 వేలకే బిగ్ QLED Smart Tv అందుకోండి.!
Lava Agni 3 5G: ఫీచర్స్
లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ ప్రకటించిన లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 7300X తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ 3D Curved AMOLED స్క్రీన్ HDR మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో వెనుక ప్రత్యేకమైన చిన్న స్క్రీన్ Mini AMOLED ను కలిగి వుంది. ఈ ఫీచర్ తో ఇండియాలో వచ్చిన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఈ ఫోన్ 8GB LPDDR5 ఫాస్ట్ ర్యామ్ మరియు 256 (UFS 3.1) ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ లావా ఫోన్ లో వెనుక OIS+EIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ మరియు 8MP టెలిఫో కలిగిన ట్రిపుల్ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 30fps వద్ద 4K వీడియోలు మరియు గొప్ప ఫోటోలు అందిస్తుందని లావా తెలిపింది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ మరియు 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
