Lava Agni 2 5G: కర్వ్డ్ డిస్ప్లే, బిగ్ కెమేరా మోడ్యూల్ తో ఇండియన్ బ్రాండ్ ఫోన్.!

HIGHLIGHTS

కొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తునట్లు LAVA అనౌన్స్ చేసింది

Lava Agni 2 కర్వ్డ్ డిస్ప్లేతో లాంచ్ అవుతోంది

వెనుక భారీ బిగ్ కెమేరా మాడ్యూల్ కూడా వుంది

భారతీయ మొబైల్ తయారీ సంస్థ LAVA ఇండియన్ మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్  స్మార్ట్ ను Lava Agni 2 పేరుతో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. లావా ప్రకటించిన ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలేమిటో ఒక లుక్కేద్దాం పదండి. 

చాలా చవక ధరలో 5G ఫోన్ ను అఫర్ చేస్తున్న బ్రాండ్ గా లావా ముందు వరుసలో నిలిచింది. Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో విడుదల చేసి ఆశ్చర్యపరిచిన లావా, ఇప్పుడు సంప్రదాయ ఫ్లాట్ డిస్ప్లేని దాటుకొని కర్వ్డ్ డిస్ప్లేతో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు లావా మార్కెట్ లో నడుసున్న కర్వ్డ్ ట్రెండ్ ను కూడా ఒడిసి పట్టుకొవాలని యోచిస్తునట్లు కనిపిస్తోంది.

Lava Agni 2 5G

ఇక లావా అందించిన టీజింగ్ ఇమేజ్ మరియు టీజర్ ను చూస్తే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Lava Agni 2 5G కర్వ్డ్ డిస్ప్లేతో కనిపిస్తోంది. అంతేకాదు, వెనుక భాగంలో గుండ్రంగా ఉన్న పెద్ద కెమేరా మోడ్యూల్ ను ఈ ఫోన్ లో కనిపిస్తోంది. అంటే, ఈ ఫోన్ లో కెమేరా లను కూడా ప్రస్తుత కాంపిటీటివ్ మార్కెట్ కు పోటీగా తీసుకు వస్తుందని భావిస్తున్నారు. 

 

https://twitter.com/LavaMobile/status/1656291935265406977?ref_src=twsrc%5Etfw

 

కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ లో అందించిన ప్రోసెసర్ గురించి గొప్ప చెబుతోంది. Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ ను MediaTek Dimensity 7050 ప్రోసెసర్ తో తీసుకు వస్తున్నట్లు, ఇండియాలో ప్రోసెసర్ తో వచ్చే మొదటి ఫోన్ కూడా ఇదే అని లావా చెబుతోంది. 

 

https://twitter.com/LavaMobile/status/1655852883894755328?ref_src=twsrc%5Etfw

 

అయితే, లావా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్  డేట్ ను ఇంకా ప్రకటించ లేదు. కానీ, ఈ ఫోన్ గురించి Coming Soon అని మాత్రం టీజింగ్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :