Lava Agni 2 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన లావా.!

HIGHLIGHTS

Lava Agni 2 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్

LAVA ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ తో టీజింగ్ చేస్తోంది

కొత్త అప్డేట్ మరియు వివరాలు ఏమిటో తెలుసుకుందామా

లావా మొబైల్స్ గత కొంత కాలంగా టీజింగ్ చేస్తున్న Lava Agni 2 5G లాంచ్ డేట్ ను కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లతో ఇప్పటి వరకూ టీజింగ్ చేసిన కంపెనీ, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ తో టీజింగ్ చేసింది. మే 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లైవ్ కార్యక్రమం ప్రారంభం అవుతుందని లావా ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన కొత్త అప్డేట్ మరియు వివరాలు ఏమిటో తెలుసుకుందామా. 

లావా మొబైల్స్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి Lava Agni 2 5G లాంచ్ డేట్ కన్ఫర్మేషన్ టీజర్ ను ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ద్వారా  Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ వెనుక కెమేరా సెటప్ ను కూడా కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసింది. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.

 

https://twitter.com/LavaMobile/status/1656959810498347013?ref_src=twsrc%5Etfw

 

ఈ టీజింగ్ ఇమేజ్ ను పరిశీలిస్తే, ఈ ఫోన్ 50MP AI Matrix Quad Camera సిస్టం ను ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ను కంపెనీ యొక్క అధికారిక Facebook పేజ్ మరియు Youtube ఛానల్ నుండి చూడవచ్చని లావా తెలిపింది.

 

https://twitter.com/LavaMobile/status/1657068533006598161?ref_src=twsrc%5Etfw

 

ముందుగా, ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను టీజింగ్ చేసింది. ఈ ఫోన్ ను కర్వ్డ్ డిస్ప్లే మరియు మీడియాటెక్ Dimensity 7050 ఆక్టా కోర్ ప్రొసెసర్ వంటి స్పెక్స్ తో టీజింగ్ చేసింది. ఈరోజు ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమేరా సిస్టం ను కలిగి ఉన్నట్లు మరియు దీనికి జతగా ఫ్లాష్ ఉన్నట్లు చూపించింది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :