64MP కెమెరా కలిగిన ఫోన్లలో టాప్-5 ఫోన్లు ఏమిటో తెలుసుకోండి.!

64MP కెమెరా కలిగిన ఫోన్లలో టాప్-5 ఫోన్లు ఏమిటో తెలుసుకోండి.!
HIGHLIGHTS

64MP కెమెరా కలిగిన ఫోన్లలో టాప్-5 ఫోన్లు

గొప్ప పర్ఫార్మెన్స్ అందించగల 64MP కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్

ఈ ఫోన్లు కెమెరా పరంగా గొప్ప ఉంటాయి

భారతదేశంలో కొత్తగా విడుదలైన స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ 64MP కెమెరా కలిగిన ఫోన్లలో టాప్-5 ఫోన్లు ఏమిటో ఈరోజు చుడనున్నాము. ఈ మధ్యకాలంలో 64MP మరియు 108MP కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్లు అధికంగా మార్కెట్ లో లాంచ్ అవుతున్నాయి. అయితే, వాటిలో గొప్ప పర్ఫార్మెన్స్ అందించగల 64MP కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ గురించే మనం మాట్లాడుకోబోయేది. మరింకెందుకు ఆలశ్యం, ఆ టాప్-5 ఫోన్లు ఏమిటో తెలుసుకుందామా.

1. OnePlus Nord CE 2 5G (Buy Here)

వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పుతో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 2MP డెప్త్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది.ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది. డిస్ప్లే పరంగా, పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే  మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.   

2. iQOO Neo 6 5G (Buy Here)

ఐకూ నియో 6 5జి స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.62 ఇంచ్ FHD+ రిజల్యూషన్ E4 AMOLED డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP OIS ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.

3. Realme GT 5G (Buy Here)

రియల్‌మీ జిటి స్మార్ట్ ఫోన్ 6.43 ఇంచ్ FHD+ సూపర్ AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 5G SoC ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 12GB LPDDR5 ర్యామ్ కూడా ఉంది. ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ లో 64MP SonyIMX682 సెన్సార్ ని ప్రధాన కెమెరాగా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16MP వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 2.0 స్కిన్ పైన  Android 11 OS పైన నడుస్తుంది.

4. Xiaomi 11 Lite NE 5G (Buy Here)

మి 11 లైట్ NE 5G లో ఒక 6.55-అంగుళాల FHD + AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 90Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్ లో Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ గల 10 బిట్ స్మార్ట్ ఫోన్ అని షియోమి చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 G ప్రోసెసర్ శక్తితో వస్తుంది.   ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ మి 11 లైట్ NE 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో, 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా -వైడ్ యాంగిల్ కెమెరా మరియు 5 MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది పంచ్-హోల్ నాచ్ కటౌట్ లోపల ఉంది.

5. Samsung Galaxy M52 5G (Buy Here)

ఈ శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ 6.7 ఇంచ్ FHD+ ఇన్ఫినిటీ 0 డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన SuperAMOLED డిస్ప్లే. ఈ ఫోన్‌మల్టీ టాస్కింగ్ అందించడానికి Snapdragon 778G ఆక్టా కోర్ ప్రోసెసర్ ను కలిగి వుంది. ఈ ఫోన్ 11 బ్యాండ్స్ వరకూ 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన OneUI 3.1 స్కిన్ పైన నడుస్తుంది. గెలాక్సీ M52 5G 5000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జి స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరా, 12ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా మరియు 5ఎంపి మ్యాక్రో కెమెరా లను అందించింది. ఇక ముందుభాగంలో, భారీ 32 ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo