రూ. 9,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ 5G Mobile ఫోన్లు ఇవే గురూ.!
అతి తక్కువ ధరలో లభించే 5జి ఫోన్స్ కొన్నే ఉన్నాయి
వీటిలో రూ. 9,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ 5G Mobile ఫోన్స్ ఇక్కడ ఉన్నాయి
మొబైల్ కంపెనీ వాటి స్మార్ట్ ఫోన్ ల ధరలు తగ్గించాయి
5జి నెట్ వర్క్ దేశంలో అత్యంత వేగంగా విస్తరించింది. అందుకే దీనికి అనుగుణంగా 5G Mobile ఫోన్లను అన్ని మొబైల్ తయారీ కంపెనీలు కూడా పోటా పోటీగా ఇండియన్ మార్కెట్లో విడుదల చేశాయి. అయితే, బడ్జెట్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరలో లభించే 5జి ఫోన్ లు కొన్నే ఉన్నాయి. వీటిలో రూ. 9,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ 5G Mobile ఫోన్లను గురించి ఈరోజు చర్చిద్దాం.
Surveyబడ్జెట్ 5G Mobile ఫోన్లు

భారతీయ మొబైల్ మార్కెట్ లో పెరుగుతున్న పోటీతో మొబైల్ కంపెనీలు వాటి స్మార్ట్ ఫోన్ ల ధరలు తగ్గించాయి. అందుకే, ఇప్పుడు కొని 5జి స్మార్ట్ ఫోన్ లు 10 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. వాటిలో బెస్ట్ 3 ఫోన్ లను ఇక్కడ అందిస్తున్నాను.
Lava Blaze 5G
రూ. 8,799
ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా చవక ధరలో విడుదల చేసిన ఈ ఫోన్, ఇప్పుడు మరింత చవక ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఇండియా నుంచి రూ. 8,799 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, స్లీక్ డిజైన్, లైట్ వెయిట్, 4GB + 3GB ఎక్స్ పాండబుల్ RAM, డైమెన్సిటీ 700 5G ప్రోసెసర్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లతో వస్తుంది.
Also Read: లేటెస్ట్ 55 ఇంచ్ LG Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!
POCO M6 5G
రూ. 8,799
ఇక ఈ లిస్ట్ లో వచ్చే రెండవ ఫోన్ పోకో ఎం6 5జి ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ కూడా ప్రస్తుతం Flipkart నుండి రూ. 899 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 6100+ 5జి ప్రోసెసర్, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా, 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.
itel P55 5G
రూ. 9,249
ఇక ఈ లిస్ట్ లో వచ్చే మూడవ 5జి ఫోన్ ఈ ఐటెల్ పి55 5జి స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ప్రస్తుతం Flipkart నుండి రూ. 9,249 రూపాయల ధరకు అందుబాటులో వుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 6080 5జి చిప్ సెట్, 4GB + 4GB ర్యామ్ ఫీచర్, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 5000mAh బ్యాటరీ మరియు 50MP డ్యూయల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లతో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile