JioBharat J1 4G: రూ. 1,799 కే OTT , UPI మరియు TV ప్రయోజనాలతో కొత్త ఫోన్ తెచ్చిన జియో.!

HIGHLIGHTS

రిలయన్స్ జియో మార్కెట్ లో కొత్త ఫీచర్ ఫోన్ ను తెచ్చింది

JioBharat J1 4G 4జి ఫీచర్ ఫోన్ ను రూ. 1,799 కే UPI మరియు TV ప్రయోజనాలతో తీసుకు వచ్చింది

ఈ ఫోన్ లో జియో ఎంటర్టైన్మెంట్ యాప్స్ ముందే ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి

JioBharat J1 4G: రూ. 1,799 కే OTT , UPI మరియు TV ప్రయోజనాలతో కొత్త ఫోన్ తెచ్చిన జియో.!

JioBharat J1 4G: రిలయన్స్ జియో మార్కెట్ లో కొత్త ఫీచర్ ఫోన్ ను తెచ్చింది. ఈ కొత్త 4జి ఫీచర్ ఫోన్ ను రూ. 1,799 కే OTT , UPI మరియు TV ప్రయోజనాలతో తీసుకు వచ్చింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ తో కస్టమర్లకు అనువైన కొత్త ప్లాన్ లను కూడా తీసుకు వచ్చింది. ఈ ఫోన్ లో జియో ఎంటర్టైన్మెంట్ యాప్స్ ముందే ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. జియో సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ ఫోన్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ పైన ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JioBharat J1 4G: ప్రైస్

జియో భారత్ జె1 4జి ఫీచర్ ఫోన్ ను రూ. 1,799 ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు నెలకు 14GB డేటా అందించే జియో భారత్ ప్లాన్ తో అందించింది. ఈ ఫోన్ ను అమెజాన్ నుంచి కొనుగోలు చేయడానికి Buy From Here పైన నొక్కండి

Also Read: 32 వేల భారీ డిస్కౌంట్ తో 12 వేలకే లభిస్తున్న Samsung Galaxy Watch 5 Pro స్మార్ట్ వాచ్.!

JioBharat J1 4G: ఫీచర్లు

జియో భారత్ జె1 4జి ఫీచర్ ఫోన్ ను 2.8 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో అందించింది. ఈ ఫోన్ లో 455 పైగా లైవ్ ఛానల్స్ ను చూడవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ జియో టీవీ ఇన్ బిల్ట్ గా వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో జియో సినిమా, జియో పే మరియు జియో చాట్ లకు కూడా సపోర్ట్ వుంది. ఇది కాకుండా, ఈ ఫోన్ తో UPI పేమెంట్ లను స్కాన్ తో చేసే అవకాశం కూడా అందించింది.

JioBharat J1 4G Features

ఈ జియో ఫోన్ లో వెనుక సింగల్ కెమెరా వుంది. ఈ ఫోన్ లో అందించిన జియో చాట్ యాప్ తో వాయిస్ మెసేజ్, చాటింగ్ మరియు ఫోటో మరియు వీడియో షేరింగ్ వంటి అవకాశం కూడా పొందవచ్చు. ఈ ఫీచర్ ఫోన్ 2500 mAh బ్యాటరీ తో వస్తుంది.

2 వేల కంటే తక్కువ ధరలో అల్రౌండ్ ఫీచర్స్ అందించే 4జి ఫీచర్ ఫోనుగా జియో భారత్ జె1 4జి ను ఇప్పుడు జియో మార్కెట్ లో ప్రవేశపెట్టింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile