32 వేల భారీ డిస్కౌంట్ తో 12 వేలకే లభిస్తున్న Samsung Galaxy Watch 5 Pro స్మార్ట్ వాచ్.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా ఈరోజు కనీవినీ ఎరుగని ఆఫర్ ను ప్రకటించింది

Samsung Galaxy Watch 5 Pro (బ్లూటూత్) స్మార్ట్ వాచ్ ను 12 వేలకే ఆఫర్ చేస్తున్న అమెజాన్

శామ్సంగ్ ఈ స్మార్ట్ వాచ్ ను ఇండియన్ మార్కెట్ లో రూ. 44,999 ధరతో విడుదల చేసింది

32 వేల భారీ డిస్కౌంట్ తో 12 వేలకే లభిస్తున్న Samsung Galaxy Watch 5 Pro స్మార్ట్ వాచ్.!

అమెజాన్ ఇండియా ఈరోజు కనీవినీ ఎరుగని ఆఫర్ ను ప్రకటించింది. అదేమిటంటే, Samsung Galaxy Watch 5 Pro (బ్లూటూత్) స్మార్ట్ వాచ్ ను ఈరోజు 32 వేల భారీ డిస్కౌంట్ తో 12 వేలకే సేల్ చేస్తున్నట్లు ప్రకటించింది. శామ్సంగ్ ఈ స్మార్ట్ వాచ్ ను 2022 ఆగస్టు నెలలో ఇండియన్ మార్కెట్ లో రూ. 44,999 ధరతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ వాచ్ ఇప్పుడు కూడా శామ్సంగ్ అధికారిక సైట్ లో ఇదే ధరతో లిస్ట్ చేయబడింది. అయితే, ఈ శామ్సంగ్ స్మార్ట్ వాచ్ అమెజాన్ నుంచి ఈరోజు కేవలం రూ. 12,499 రూపాయల ధరకే లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy Watch 5 Pro (బ్లూటూత్): ఆఫర్

శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 ప్రో (బ్లూటూత్) ఈరోజు అమెజాన్ నుంచి 74% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,499 రూపాయల సరసమైన ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ను HSBC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,500 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను ఆఫర్ ధరకే కొనడానికి Buy From Here పైన నొక్కండి.

galaxy watch5 pro bluetooth deal on amazon india
galaxy watch5 pro bluetooth deal on amazon india

Samsung Galaxy Watch 5 Pro :

ఈ శామ్సంగ్ స్మార్ట్ వాచ్ వాటర్ రెసిస్టెంట్ మరియు మరింత పటిష్టంగా ఉండే 1.4 ఇంచ్ సఫైర్ క్రిస్టల్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఈ వాచ్ టోటల్ 47 గ్రాముల బరువుతో చాలా లైట్ గా ఉంటుంది. ఈ వాచ్ 590mAh బ్యాటరీతో ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ వాచ్ బాడీ కంపోజిషన్ మెజర్మెంట్ (BIS మెజర్మెంట్) ఫీచర్ తో మీ శరీరంలో ఉన్న అధిక కొవ్వు గురించి తెలుపుతుంది.

Samsung Galaxy Watch 5 Pro

ముఖ్యంగా, హార్ట్ గురించి నిజం సమయంలో వివరాలు అందించే ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ ను ఈ స్మార్ట్ వాచ్ కలిగి వుంది. ఈ స్మార్ట్ వాచ్ 90 ఎక్సర్సైజ్ మరియు ఫిట్నెస్ ట్రాకింగ్ తో వస్తుంది. ఈ వాచ్ స్లీప్ ట్రాకింగ్, Accelerometer, Barometer, Bioelectrical Impedance Analysis Sensor మరియు ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సార్ లను కూడా కలిగి ఉంటుంది.

Also Read: Honor Magic 6 Pro: ఇండియాలో విడుదలవుతున్న హానర్ సూపర్ కెమెరా ఫోన్.!

శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 ప్రో 1.5GB మెమరీ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఈ ధరలో పవర్ ఫుల్ ఫీచర్స్ తో లభించే బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్ అని తడుముకోకుండా చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo