జియో వినియోగదారుల కోసం ప్రత్యేక సేల్ : శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ సేల్
జియో అందిస్తున్న ఈ గెలాక్సీ M సిరీస్ సేల్, ఫిబ్రవరి 22వ తేది మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమవుతుంది
జియో టెలికం శామ్సంగ్ భాగస్వామ్యంతో శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ స్మార్ట్ ఫోన్లను, తన వినియోగదారుల కోసం ఇప్పుడు నేరుగా అందిస్తుంది. కొనుగోలు చేయదలచిన వినియోగదారులు, Jio.com లేదా My Jio App ద్వారా ఫిబ్రవరి 22వ తేది మధ్యాహ్నం 12 గంటలకి నేరుగా కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇచ్చిన వివరాలతో సులభముగా కొనుగోలు చేయవచ్చు.
Survey1. ముందుగా, Jio.com లేదా My Jio App లాగిన్ చేయాలి
2. ఫిబ్రవరి 22వ తేది మధ్యాహ్నం 12 గంటలకి ఈ సేల్ Live చేయబడుతుంది, అప్పుడు "Buy Now" పైన నొక్కండి
3. మీరు కొనుగోలు చేయదలచిన ఫోన్ను ఎంచుకోండి
4. మీరు ఈ ఫోన్ను పొందవల్సిన చిరునామా వివరాలను, మీ Jio నంబరుతో పాటుగా నమోదుచేయండి
5. కొనుగోలును పూర్తి చేయండి
ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషం ఏమిటంటే, ఈ సేల్ కేవలం జియో వినియోగదారులకి మాత్రమే.
శామ్సంగ్ మరియు జియో భాగస్వామ్యంతో, "శామ్సంగ్ గెలాక్సీ M- జియో డబుల్ డేటా అఫర్ -2019", ని అందిస్తోంది ఈ గెలాక్సీ M10&M20 స్మార్ట్ ఫోన్లతో. దీని ద్వారా రూ. 3112 వరకు లాభాలను పొందవచ్చు. అయితే, ఈ డబుల్ డేటా అఫర్ కేవలం రూ. 198 మరియు రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క 10 రీఛార్జిల పైన మాత్రమే వర్తిస్తుంది. అలాగే, 6 నెలల వరకు EMI పైన కొనుగోలుచేసే వారికీ No Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ M10 స్పెసిఫికేషన్స్
ఈ గెలాక్సీ M10, 19:9 యాస్పెక్ట్ రేషియో గల ఒక 6.22- అంగుళాల HD+ ఇన్ఫినిటీ – V డిస్ప్లేతో వస్తుంది. ఈ ఇన్ఫినిటీ – V డిస్ప్లే అనేది డిస్ప్లే పైభాగంలో V-ఆకారంలో వుండే, ఒక వాటర్ డ్రాప్ నోచ్ వలెనే కనిపిస్తుంది. ఇది 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. ఇది 1.6GHz వద్ద క్లాక్ చేయబడిన Exynos 7870 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఈ ఫోన్, 2GB + 16GB స్టోరేజి మరియు 3GB + 32GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు దీని స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగి ఉంటుంది.. ఇది డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.
ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.9 అపర్చరు గల ఒక 13MP సెన్సారుకు జతగా 120 డిగ్రీల 5MP అల్ట్రా – వైడ్ యాంగిల్ సెన్సరుతో అనుసంధానించిన డ్యూయల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ముందు, f/2.0 అపర్చరు గల ఒక 5MP కెమేరాతో వస్తుంది మరియు ముందు ఇన్ డిస్ప్లే ఫ్లాష్ తో వస్తుంది. ఇందులో, 3400mAh బ్యాటరీని అందిచారు మరియు ఇది పేస్ అన్లాక్ ఫీచరుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,శామ్సంగ్ v9.5 ఆధారితంగా ఆండ్రాయిడ్ 8.1.0 OS పైన నడుస్తుంది. ఇది ఓషియన్ బ్లూ మరియు చార్ కోల్ బ్లాక్ వంటి రెండు రంగులలో లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ M20 స్పెసిఫికేషన్స్
ఇక గెలాక్సీ M20 గురించి చూస్తే , ఇది 2340x 1080 రిజల్యూషనుతో, 19.5 :9 యాస్పెక్ట్ రేషియో గల కొంచెం పెద్దదైన ఒక 6.3 – అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా, ఒక వాటర్ డ్రాప్ నోచ్ వలె కనిపించే, ఇన్ఫినిటీ – V డిస్ప్లేతో వస్తుంది. ఇది 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. ఇది 1.8GHz డ్యూయల్ కొర్ జతగా 1.6 హెక్సాకోర్ కలిపిన, క్లాక్ చేయబడిన Exynos 7904 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా Mali-G71 MP2 GPU శక్తితో వస్తుంది. ఈ ఫోన్, 3GB + 32GB స్టోరేజి మరియు 4GB + 64GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.
ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.9 అపర్చరు గల ఒక 13MP సెన్సారుకు జతగా 120 డిగ్రీల 5MP అల్ట్రా – వైడ్ యాంగిల్ సెన్సరుతో అనుసంధానించిన డ్యూయల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ముందు, f/2.0 అపర్చరు8 ఒక 8 MP కెమేరాతో వస్తుంది మరియు ముందు ఇన్ డిస్ప్లే ఫ్లాష్ తో వస్తుంది. ఇందులో, 5000mAh బ్యాటరీని అందిచారు మరియు ఇది పేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,శామ్సంగ్ v9.5 ఆధారితంగా ఆండ్రాయిడ్ 8.1.0 OS పైన నడుస్తుంది. ఇది ఓషియన్ బ్లూ మరియు చార్ కోల్ బ్లాక్ వంటి రెండు రంగులలో లభిస్తుంది. అదనంగా, ఈ శామ్సంగ్ గెలాక్సీ M20, HD స్ట్రీమింగ్ కోసం WideVine L1 దృవీకరణతో వస్తుంది మరియు Dolby Atmos సౌండ్ ఫిచరుతో, వీడియో మరియు ఆడియోని మరింతగా ఎంజాయ్ చేయవచ్చు.