2021 జనవరి: అతి తక్కువ ధరకే అతిపెద్ద బ్యాటరీతో లభించే స్మార్ట్ ఫోన్ల లిస్ట్

2021 జనవరి: అతి తక్కువ ధరకే అతిపెద్ద బ్యాటరీతో లభించే స్మార్ట్ ఫోన్ల లిస్ట్
HIGHLIGHTS

పెద్ద బ్యాటరీ వున్న స్మార్ట్ ఫోన్ ప్రధాన ఎంపికగా మారుతోంది

అతి తక్కువ ధరకే అతిపెద్ద బ్యాటరీతో లభించే స్మార్ట్ ఫోన్లు

బడ్జెట్ ధరలో పెద్ద బ్యాటరీ గల లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు

ప్రస్తుతం ప్రతి ఒకరికి కూడా పెద్ద బ్యాటరీ వున్న స్మార్ట్ ఫోన్ ప్రధాన ఎంపికగా మారుతోంది. ఇందుకు కారణం కూడా వుంది. ఎందుకంటే, ఆన్లైన్ లో'మీటింగ్స్, చాటింగ్స్ మరియు ఆఫిస్ తో పాటుగా అన్ని పనులకు కూడా స్మార్ట్ ఫోన్ ఎక్కువ సమయం నిలిచేదిగా ఉండాల్సి రావడం. అందుకే, అన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా పెద్ద బ్యాటరీ కలిగిన అనేక స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. అయితే, అతి తక్కువ ధరకే అతిపెద్ద బ్యాటరీతో లభించే స్మార్ట్ ఫోన్లు మాత్రం కొన్ని మాత్రమే వున్నాయి. అందుకే, ఈ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం….  

Moto G9 Power

ఈ మోటో G9 స్మార్ట్ ఫోన్ ఒక 6.5-అంగుళాల HD + డిస్ప్లే తో వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో లాంచ్ చేయబడింది. ఈ స్క్రీన్ మీకు 20: 9 యాస్పెక్ట్ రేషియో లభిస్తోంది కాబట్టి ఎక్కువ స్క్రీన్ ఏరియా మీకు అందుతుంది. మోటో G9 స్మార్ట్ ఫోన్, Snapdragon 662 చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది మరియు ఈ చిప్సెట్ తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా Moto G9 నిలుస్తుంది.

మోటో G9 స్మార్ట్ ఫోన్ లో, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ లో 48 MP  ప్రైమరీ కెమెరా అమర్చారు, దీనికి జతగా 2 MP మ్యాక్రో  కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సార్ ను కూడా అందించారు. ముందుభాగంలో, ఈ ఫోన్ లో 8 MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

Redmi 9 Power

రెడ్‌మి 9 పవర్ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.53 ఇంచ్ ఫుల్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 400 నిట్స్  బ్రైట్నెస్ అందించగలదు  మరియు ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 662 SoC తో పనిచేస్తుంది.

ఇందులో, 48MP ప్రధాన కెమెరా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్  కెమెరాకి జతగా 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లను కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి వుంది. ఈ 9 పవర్ ఫోన్, అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. అయితే, బాక్సులో మాత్రం 22.5 W ఫాస్ట్ చార్జర్ ను బాక్సుతో పాటుగా ఇస్తునట్లు కంపెనీ తెలిపింది.

Realme C12

రియల్‌ మీ సి 12 మొబైల్ ఫోన్ ‌ఒక మీడియాటెక్ హెలియో జి 35 చిప్‌ సెట్ శక్తితో పనిచేస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియు మరియు ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్‌ తో జతగా వస్తుంది. ఒక  మైక్రో SD కార్డ్ సహాయంతో కూడా స్టోరేజ్ కూడా పెంచవచ్చు. ఈ మొబైల్ ఫోన్ RealmeUI 1.0 ఆధారంగా ఆండ్రాయిడ్ 10 తో  నడుస్తుంది.

రియల్‌ మీ సి 12 స్మార్ట్ ‌ఫోన్ ‌లో, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ ‌లో 13 ఎంపి ప్రైమరీ కెమెరా అమర్చారు, దీనికి జతగా 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సార్ ‌ను కూడా పొందవచ్చు. ముందుభాగంలో, ఈ ఫోన్ ‌లో 5 MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ ‌లో ఒక అతి పెద్ద 6000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీఆటో వస్తుంది. ఈ బ్యాటరీ 10W స్పీడ్ ఛార్జింగ్ సాంకేతికతో ఉంటుంది.

Realme C15

Realme C15 ఒక 6.5-అంగుళాల 29: 9 LCD డిస్‌ప్లేను హెచ్‌డి + రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్న వాటర్ ‌డ్రాప్ నాచ్ తో వస్తుంది. వెనుకవైపు, ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లో 13 ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరా మరియు 2 ఎంపి డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లో వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్ కూడా ఉంది.

రియల్‌ మీ సి 15, MediaTek Helio G35 SoC తో పాటు జతగా 3 జిబి లేదా 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది. 6000 ఎంఏహెచ్ మొత్తం ప్యాకేజీకి అద్భుతమైన శక్తినిస్తుంది మరియు ఇది మైక్రో యుఎస్‌బి తో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Tecno Pova

Tecno Pova ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ హెలియో జి 80 SoC తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియుతో పాటు 4 జిబి ర్యామ్‌తో ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన ఈ ఫోన్ HiOS 7.0 లో నడుస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, పెద్ద 6.8-అంగుళాల HD + స్క్రీన్ 720 x 1640 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది, పిక్సెల్ డెన్సిటీ 264PPI గా ఉంటుంది.

బ్యాటరీ పరంగా, ఇది 6,000 ఎమ్ఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ వాదనల ప్రకారం ఫోన్‌ను 30 రోజుల వరకు స్టాండ్‌బైలో ఉంచగలదు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది మరియు ఇతర సింగిల్ ఐసి ఆధారిత ఫాస్ట్ ఛార్జింగ్ పరికరాల కంటే ఫోన్ 20% వేగంగా ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo