itel Flip One: కేవలం రూ. 2,499 రూపాయలకే ఫ్లిప్ కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్.!

HIGHLIGHTS

భారత మార్కెట్ లో కొత్త ఫ్లిప్ ఫోన్ ను ఐటెల్ లాంచ్ చేసింది

itel Flip One ఫోన్ ను కేవలం రూ. 3,000 ఉప బడ్జెట్ లో విడుదల చేసింది

ఈ ఫీచర్ ఫోన్ ఆరెంజ్, లైట్ బ్లూ మరియు బ్లాక్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది

itel Flip One: కేవలం రూ. 2,499 రూపాయలకే ఫ్లిప్ కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్.!

itel Flip One: భారత మార్కెట్ లో కొత్త ఫ్లిప్ ఫోన్ ను ఐటెల్ లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ఫోన్ లను విరివిగా అందిస్తున్న మొబైల్ కంపెనీలలో ఒకటైన ఐటెల్ ఈ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం రూ. 3,000 రూపాయల ఉప బడ్జెట్ లో విడుదల చేసింది ఐటెల్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫీచర్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

itel Flip One: ప్రైస్

ఐటెల్ ఫ్లిప్ వన్ ఫీచర్ ఫోన్ ను కేవలం రూ. 2,499 ధరలో విడుదల చేసింది. ఈ ఫీచర్ ఫోన్ ఆరెంజ్, లైట్ బ్లూ మరియు బ్లాక్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Also Read: Flipkart నుంచి ఈరోజు చవక ధరకే లభిస్తున్న Apple iPhone 12

itel Flip One: ఫీచర్స్

ఐటెల్ ఫ్లిప్ వన్ ఫీచర్ ఫోన్ ను స్టైలిష్ డిజైన్ మరియు ప్రీమియం లెథర్ టెక్చర్డ్ బ్యాక్ తో విడుదల చేసింది. ఈ ఫీచర్ ఫోన్ 2.4 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ OVGA స్క్రీన్ మరియు ఇది మంచి క్వాలిటీ విజువల్స్ అందిస్తుందని ఐటెల్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో గ్లాస్ కీ ప్యాడ్ ఉంటుంది. ఈ ఫ్లిప్ ఫీచర్ ఫోన్ 13 రీజనల్ బాష లకు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ తో పాటు లైట్ వైట్ తో ఆకర్షణీయమైన ఆప్షన్ గా మారుతుందని ఐటెల్ చెబుతోంది.

ఈ ఐటెల్ ఫీచర్ ఫ్లిప్ ఫోన్ 7 రోజులు పవర్ బ్యాకప్ అందించగల పెద్ద 1200 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో టైప్ C సపోర్ట్ తో ఇది యూనివర్సల్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బడ్జెట్ ఫోన్ గా కూడా నిలుస్తుంది. ఈ ఐటెల్ ఫీచర్ ఫోన్ BT కాలింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ SIM కార్డ్ సపోర్ట్ మరియు VGA కెమెరా కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile