రియల్మీ 3 స్మార్ట్ ఫోన్ షావోమి రెడ్మి నోట్ 7 కి పోటీ కానుందా ?

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ గురించి కొత్తగా విడుదల చేసిన టీజ్ ఏం చెబుతోంది.

మొదటి త్రైమాసికం చివరినాటికి రియల్మి 3 స్మార్ట్ ఫోన్ను రియల్మి కంపెనీ విడుదల చేయవచ్చని, జనవరిలో వచ్చిన ఒక నివేదిక తెలిపింది. రియల్మి 2 నుంచి తన మొబైల్ ఫోన్ను భిన్నంగా తయారు చేయనున్నట్లు కూడా కంపెనీ తెలిపింది. ట్రిపుల్ కెమెరా సెటప్ లేదా "పంచ్ హోల్ " స్క్రీనుతో ఫోన్ను ప్రారంభించాలనే ఆలోచన తమకు లేదని ఎగ్జిక్యూటివ్ ముందుగానే తెలియచేసారు. అయితే, కంపెనీ ఒక 48MP సెన్సారుతో ఒక హ్యాండ్ సెట్ అందించడం కోసం పనిచేస్తుందని ఆయన చెప్పారు.

ఈ విషయాలన్నీ పోల్చి చూస్తే , షావోమి ఒక 48MP కెమెరాతో ఇండియాలో ఫిబ్రవరి 28 న రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోను విడుదల చేయనున్నట్లు టీజ్ చేశారు. షావోమి దాని బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి, రెడ్మి నోట్ 7 ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో ప్రారంభించబడింది మరియు ఇటీవల,ఈ ఫోన్ Flipkart లో టీజ్ చెయ్యబడుతోంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC పైన నడుస్తుంది. అయితే, రియల్మీసంస్థ తాజాగా విడుదల చేసిన,  ప్రాసెసర్ సరిపోలిక టీజ్ చూస్తుంటే రెడ్మి నోట్ 7 కి సరైన పోటీగా రియల్మీ3 స్మార్ట్ ఫోన్ను రియల్మీ తీసుకురానున్నట్లు అనిపిస్తోంది.

ఇండియాలో మార్చి 4 న Realme 3 ను విడుదల చేస్తామని రియల్మీ  ప్రకటించింది. రియల్ CEO అయినటువంటి, మాధవ్ సేథ్ ఒక మీడియా టెక్ హీలియో P70 మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ల మధ్య ఒక స్పెసిఫికల్ పోలికను చూపించే ఒక చిత్రాన్ని, సంస్థ యొక్క అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసారు. ఈ ట్వీట్ ఒక టీజర్ వలెనే అనిపిస్తోంది, అలాగే రాబోయే రియల్ 3 అంతర్గతంగా ఒక మీడియా టెక్ హీలియో P70 SoC తో రానున్నట్లు సూచిస్తుంది.

ఇప్పుడు తొలగించిన ట్వీట్, దాని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక చిత్రాన్ని పోస్ట్ చేయడం ద్వారా ఒక డ్యూయల్ -కెమెరా సేటప్పుతో టీజ్ చేసిన తర్వాత, దీన్ని తొలగించింది. ఈ చిత్రంలో కూడా డైమండ్ డిజైన్ కనిపించింది. Realme U1 తరువాత ఒక మీడియా టెక్ ప్రాసెసర్ ద్వారా రానున్న మరొక రియల్మీ ఫోనుగా  ఈ రియాల్మీ3 ఉంటుంది. ఇప్పుడు పోల్చి చూస్తే, హెలియో P70 చిప్సెట్ భారీ గేమ్స్ ప్లే కోసం కూడా తక్కువ పవర్ వినియోగం, వేగవంతమైన CPU పనితీరు మరియు వేగవంతమైన డౌన్లోడ్లను కలిగి ఉంది. ఈ హీలియో P70 ను  స్నాప్ డ్రాగన్ 660 యొక్క 14nm తో పోలిస్తే 12nm ప్రక్రియపై నిర్మించబడింది.

అయితే, ఈ హ్యాండ్ సెట్ గురించి పూర్తి వివరాలు  ప్రస్తుతానికి అందుబాటులో లేవు కానీ, ఈ ఫోన్ దాని పూర్వీకుల వలనే అతితక్కువ ధరతో వస్తుందని భావిస్తున్నారు. ఇటీవలే, షిత్ ట్విట్టర్లో రాబోయే స్మార్ట్ ఫోన్  "రియల్మే 1+ రియల్లీ 2 = బెస్ట్ పవర్ మరియు బెస్ట్ స్టైల్ అదే సెగ్మెంట్లో " అని స్పష్టం చేసాడు. షావోమి దాని రాబోయే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయిన, రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్నీ విడుదల చేయడానికి డేట్ ప్రకటించిన తరువాత Realme 3 టీజర్స్ వ్యూహాత్మకంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇవన్నీ చూస్తుంటే రెడ్మి నోట్ 7 విడుదలకానున్న సమయంలో రియల్మీ సంస్థ సరికొత్తగా తీసుకురానున్న రియల్మీ 3 ని దానికి పోటీగా తీసుకురానున్నట్టు అంచనా వేస్తున్నారు.           

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :