చౌక ధరకే 5G స్మార్ట్ ఫోన్, Oneplus నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

చౌక ధరకే 5G స్మార్ట్ ఫోన్, Oneplus నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?
HIGHLIGHTS

ఇప్పుడు అందరి కళ్ళు కూడా వన్ ‌ప్లస్ నార్డ్ ‌పై ఉన్నాయి, కాని కంపెనీ నార్డ్ యొక్క లైట్ వెర్షన్ పైన కూడా పనిచేస్తోందని, కొత్త నివేదిక చెబుతోంది.

కొత్తగా క్వాల్ ‌కామ్ ప్రకటించిన స్నాప్‌ డ్రాగన్ 690 చిప్ సెట్ తో పనిచేసే, ఒక కొత్త వన్ ‌ప్లస్ స్మార్ట్ ‌ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించింది.

ఇది వన్ ‌ప్లస్ నుండి మరింత సరసమైన ధరలో మిడ్ -రేంజ్ స్మార్ట్ ఫోన్ కావచ్చని చెప్పడానికి అతిపెద్ద సూచన.

ఇప్పుడు అందరి కళ్ళు కూడా వన్ ‌ప్లస్ నార్డ్ ‌పై ఉన్నాయి, కాని కంపెనీ నార్డ్ యొక్క లైట్ వెర్షన్ పైన కూడా పనిచేస్తోందని, కొత్త నివేదిక చెబుతోంది. కొత్తగా క్వాల్ ‌కామ్ ప్రకటించిన స్నాప్‌ డ్రాగన్ 690 చిప్ సెట్ తో పనిచేసే, ఒక కొత్త వన్ ‌ప్లస్ స్మార్ట్ ‌ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఇది వన్ ‌ప్లస్ నుండి మరింత సరసమైన ధరలో మిడ్ -రేంజ్ స్మార్ట్ ఫోన్ కావచ్చని చెప్పడానికి అతిపెద్ద సూచన.

ఇంకా పేరు తెలియని ఈ స్మార్ట్ ఫోన్, మోడల్ నంబర్‌తో జాబితా చేయబడింది దీని మోడల్ నంబర్ ‘వన్‌ ప్లస్ BE2028’, ఒక కొత్త లైనప్ ‌ను సూచిస్తుంది. ఆసక్తికరంగా, వన్‌ ప్లస్ నార్డ్ యొక్క మోడల్ సంఖ్య వన్‌ ప్లస్ “AC2003”కాగా , రాబోయే గుర్తుతెలియని వన్ ‌ప్లస్ స్మార్ట్ ఫోనుకు ‘లిటో’ మదర్‌బోర్డు ఉంటుందని గీక్‌బెంచ్ జాబితా వెల్లడించింది. ఇది సాధారణంగా స్నాప్‌ డ్రా6గన్ 765 చిప్‌లతో నడిచే పరికరాలతో ముడిపడి ఉంటుంది. ఏదేమైనా, CPU యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ ఇతర వివరాలతో పాటు కొత్త క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ 690 వైపు ముగ్గుచూపుతుంది, ఇది 6-సిరీస్‌లో 5 జి మోడెమ్‌తో వచ్చిన మొదటి ప్రాసెసర్.

ఆండ్రాయిడ్ 10 లో ఫోన్ నడుస్తుందని మరియు 6 జిబి ర్యామ్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, స్నాప్‌డ్రాగన్ 690 ఒక ఆసక్తికరమైన ఎంపిక అవుతుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 675 ను సక్సెసర్ గా చెప్పబడుతుంది మరియు గీక్బెంచ్ జాబితా సూచించిన మాదిరిగానే 1.7GHz వరకు క్లాక్ చేసిన ఎనిమిది క్రియో 560 సిపియు కోర్లను అందిస్తుంది.

స్నాప్‌డ్రాగన్ 690 ఆధారిత వన్‌ప్లస్ నార్డ్ లైట్ ఇన్‌కమింగ్ కావచ్చు

ఇవన్నీ జూలై 21 న భారతదేశంలో ప్రారంభించబోయే వన్ ‌ప్లస్ నార్డ్ యొక్క తేలికపాటి వెర్షన్ వైపు చుపులు మరల్చుతున్నాయి. ఆసక్తికరంగా, వన్ ‌ప్లస్ ఇంతకుముందు ‘నార్డ్ లైట్’ గురించి ఎటువంటి సూచనలు ఇవ్వలేదు. అయితే, ఈ లైట్ వెర్షన్  వచ్చే వారం వన్‌ప్లస్ నార్డ్‌తో పాటు విడుదల చేయవచ్చని, మనం ఊహించవచ్చు.

వాస్తవానికి, ఇది వన్ ‌ప్లస్ నార్డ్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ గా ఉండవచ్చు, ఇది వన్‌ ప్లస్ మరింత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 765 కు మారడానికి ముందు స్నాప్‌ డ్రాగన్ 690 SoC తో పరీక్షిస్తోంది. అయితే, ప్రస్తుతానికి దీని గురించి కొంచెం మాత్రమే తెలుసు, అలాగే ఇది నిజంగా కంపెనీ పనిచేస్తున్న కొత్త వేరియంట్ అయితే కనుక, రాబోయే కొద్ది రోజుల్లోనే మనము దాని గురించి మరింత తెలుసుకోవడం ఖాయం.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo