iQOO Z9s Pro 5G: ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఐకూ Z9s ప్రో స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఐకూ రీసెంట్ గా విడుదల చేసిన ఈ బడ్జెట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ఆఫర్ తో మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. అమెజాన్ ఇండియా ద్వారా మంచి డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ సేల్ అవుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
iQOO Z9s Pro 5G: ప్రైస్ మరియు ఆఫర్
ఐకూ Z9s ప్రో 5జి స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 24,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ (8GB + 256GB) ని రూ. 26,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 28,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 భారీ తగ్గింపు లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ ను రూ. 22,999 ధరకు, రెండవ వేరియంట్ ను రూ. 24,999 ధరకు మరియు హై ఎండ్ వేరియంట్ ను రూ. 26,999 ధరకి పొందవచ్చు.
ఐకూ Z9s ప్రో స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ కేవలం 7.49 మందంతో చాలా నాజూకుగా ఉంటుంది. అయినా సరే ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన పెద్ద 3D కర్వుడ్ AMOELD స్క్రీన్ ను కలిగి వుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో క్వాల్కమ్ పవర్ ఫుల్ ప్రోసెసర్ అయిన Snapdragon 7 Gen 3 తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది.
ఈ ఫోన్ లో 8GB మరియు 12 GB ర్యామ్ వేరియంట్ మరియు 128GB మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో వెనుక OIS సపోర్టెడ్ 50MP Sony IMX882 మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ వుంది.