iQOO Z9 Lite 5G చవక ధరలో Sony AI కెమెరా, IP64 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వచ్చింది.!
iQOO Z9 Lite 5G ను ఐకూ ఈరోజు ఇండియాలో విడుదల చేసింది
ఐకూ జెడ్ 9 లైట్ 5జి ను రూ. 9,999 ప్రారంభ ధరకే ప్రకటించింది
ఈ ఫోన్ జూలై 20 వ తేదీ సేల్ కి అందుబాటులోకి వస్తుంది
iQOO Z9 Lite 5G స్మార్ట్ ఫోన్ ను ఐకూ ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను చవక ధరలో 50MP Sony AI కెమెరా, IP64 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో విడుదల చేసింది. జెడ్ 9 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ను మంచి ఆఫర్స్ తో 10 వేల కంటే తక్కువ ధరలో అందుకునే అవకాశం కూడా కంపెనీ అందించింది.
SurveyiQOO Z9 Lite 5G : ప్రైస్

ఐకూ జెడ్ 9 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 9,999 ప్రారంభ ధరకే ప్రకటించింది. అయితే, ఈ రేటును బ్యాంక్ మరియు ఇతర లాంచ్ ఆఫర్లతో కలిపి రూ. 9,999 ధరకే అందుకునే అవకాశం అందించింది. ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదటి రోజైన జూలై 20 వ తేదీ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: 8 వేల కంటే తక్కువ ధరలో పెద్ద Smart Tv కోసం చూస్తున్నారా..!
iQOO Z9 Lite 5G : ఫీచర్లు
ఐకూ ఈరోజే సరికొత్తగా లాంచ్ చేసిన ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ Dimensity 6300 చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 6GB ఫిజికల్ ర్యామ్ + 6GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది. ఈ ఫోన్ లో 6.56 ఇంచ్ బిగ్ స్క్రీన్ ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP Sony AI మెయిన్ కెమెరా మరియు 2MP బొకే కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో ముందు సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ P64 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 5000mAh బ్యాటరీ ఉంది మరియు ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile