iQOO Z11x 5G స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ మీడియాటెక్ చిప్ సెట్ తో ప్రకటించింది.!

HIGHLIGHTS

iQOO Z11x 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్ కూడా ఈ ఫోన్ లాంచ్ టీజర్ లో భాగంగా అందించింది

ఐకూ జెడ్ 11x స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఫోన్ డిజైన్ ను రివీల్ చేసింది

iQOO Z11x 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ టీజర్ అందించిన కంపెనీ ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్ కూడా ఈ ఫోన్ లాంచ్ టీజర్ లో భాగంగా అందించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ వివరాలు మరియు ఈ ఫోన్ లాంచ్ వివరాలు ఏమిటో చూద్దామా.

iQOO Z11x 5G: ఎప్పుడు లాంచ్ అవుతుంది?

ఐకూ జెడ్ 11x స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ ను త్వరలో ఇండియాలో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ నుంచి టీజింగ్ చేస్తోంది. దీనికోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ అమెజాన్ నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే, ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా ఐకూ లాంచ్ చేస్తుంది.

Also Read: WhatsApp Holi Features: 2026 హోలీ పండుగ కోసం కొత్త ఫీచర్స్ అందించిన వాట్సాప్.!

iQOO Z11x 5G: కీలక ఫీచర్స్

ఐకూ జెడ్ 11x స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఫోన్ డిజైన్ ను రివీల్ చేసింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 Turbo చిప్ సెట్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది.

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కలిగిన ఈ చిప్ సెట్ 10 లక్షల AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన చిప్ సెట్ తో ఈ ఫోన్ ఈ సెగ్మెంట్ లో వేగవంతమైన ఫోన్ గా నిలుస్తుందని ఐకూ చెబుతోంది. వాస్తవానికి, ఈ సిరీస్ నుంచి వచ్చే ఫోన్లు బడ్జెట్ యూజర్ కోసం అందించే ఫోన్లుగా ఉంటాయి. అయితే, ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయితే మాత్రం ఇది గొప్ప విషయమే అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :