iQOO Z11 Key specs revealed ahead of launch sony camera big battery and more
iQOO Z11 స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ ను ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా ఐకూ ఈరోజు రివీల్ చేసింది. ఇప్పటి వరకు ఈ డిజైన్ వివరాలు మాత్రమే వెల్లడించిన ఐకూ, ఈరోజు ఈ ఫోన్ కెమెరా, బ్యాటరీ మరియు ఇతర కీలక ఫీచర్లు కూడా బయటపెట్టింది. ఈ ఫోన్ అందమైన డిజైన్ తో పాటు జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అవుతోందని కంపెనీ రివీల్ చేసిన ఫీచర్స్ వెల్లడిస్తున్నాయి.
ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ ఆగస్టు 20వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ద్వారా సేల్ అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంది.
ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ అందమైన మరియు చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ముందు మరియు వెనుక కర్వుడ్ డిజైన తో ఉంటుంది. ఇందులో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగిన బిగ్ 3D కర్వుడ్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 1.2 మిలియన్ కంటే అధిక AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ Dimensity 7500 టర్బో చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది ప్రత్యేకమైన ఏఐ ప్రాసెసింగ్ యూనిట్ తో వస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX 882 మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ అద్భుతమైన లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్, ప్రత్యేకమైన ఐకూ కెమెరా ఫీచర్స్ మరియు గొప్ప వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో గొప్ప బ్యాటరీ సెటప్ కూడా అందించింది. ఇందులో 7050 mAh బిగ్ బ్లూ వోల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఎక్కువ సమయం ఈ ఫోన్ కు బ్యాకప్ అందిస్తుందని ఐకూ తెలిపింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS తో వస్తుంది మరియు 3 OS అప్గ్రేడ్స్ అండ్ 5 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ లో ప్రత్యేకమైన ఆరిజిన్ ఐల్యాండ్ కూడా ఉంటుంది.
Also Read: Sony Dolby Audio సౌండ్ బార్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ .. చవక ధరలో సౌండ్ బార్ అందుకోండి.!
ఇక ఈ ఫోన్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సెటప్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP68 అండ్ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా కలిగి ఉంటుంది.