iQOO Neo 6 5G: భారీ ఫీచర్లు మరియు ఆఫర్లతో వచ్చింది..!!

iQOO Neo 6 5G: భారీ ఫీచర్లు మరియు ఆఫర్లతో వచ్చింది..!!
HIGHLIGHTS

iQOO ఈరోజు తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ iQOO Neo 6 5G ని ప్రకటించింది

E4 AMOLED డిస్ప్లేతో వచ్చిన ఐకూ నియో 6 5జి స్మార్ట్ ఫోన్

గొప్ప ఆఫర్లను కూడా జతచేసింది

iQOO ఈరోజు తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ iQOO Neo 6 5G ని ప్రకటించింది. ఈసారి ఐక్యూ ఈ స్మార్ట్ ఫోన్ ను HDR10+ సర్టిఫైడ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన E4 AMOLED డిస్ప్లేతో పాటుగా 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు మంచి కెమెరా సిస్టంతో తీసుకువచ్చింది. ఐకూ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు నుండే సేల్ కోసం అంధుబాటులో ఉంచింది మరియు గొప్ప ఆఫర్లను కూడా జతచేసింది. ఈ లేటెస్ట్ ఐకూ 5G స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు మరియు స్పెక్స్ గురించి పూర్తిగా తెలుసుకుందామా.     

iQOO Neo 6 5G: ధర

ఐకూ నియో 6 5జి స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్  8GB+128GB వేరియంట్ ధర రూ.29,999 మరియు 12GB+256GB వేరియంట్ ధర రూ.33,999 గా ప్రకటించింది. లాంచ్ అఫర్ లో భాగంగా Amazon నుండి 1000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు మరియు EMI అప్షన్ తో ఈ ఫోన్ లను కొనేవారికి 3000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ లో ఈరోజు నుండి సేల్ కి అందుబాటులో వుంది.  

iQOO.png

iQOO Neo 6 5G: స్పెక్స్

ఐకూ నియో 6 5జి స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.62 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ E4 AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1300 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 36907 mm² క్యాస్ కేడ్ కూలింగ్ సిస్టం ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP OIS ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమర్‌ లను ఆకర్షించడానికి, ఈ ఫోన్ లో 4D గేమ్ వైబ్రేషన్ ని లీనియర్ వైబ్రేషన్ మోటార్ తో జతచేసింది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo