5G రివల్యూషన్ సేల్ చివరి రోజు iQOO Neo 6 5G పైన బిగ్ డీల్.!

HIGHLIGHTS

5G రివల్యూషన్ సేల్ చివరి రోజు iQOO Neo 6 5G పైన బిగ్ డీల్ అఫర్ చేస్తోంది

5G రివల్యూషన్ సేల్ ఈరోజు ముగుస్తుంది

ఐకూ లేటెస్ట్ పవర్ ఫుల్ 5G స్మార్ట్ iQOO Neo 6 5G ని తక్కువ ధరకే అందుకోవచ్చు

5G రివల్యూషన్ సేల్ చివరి రోజు iQOO Neo 6 5G పైన బిగ్ డీల్ అఫర్ చేస్తోంది అమేజాన్. రీసెంట్ గా అనౌన్స్ చేసిన 5G రివల్యూషన్ సేల్ ఈరోజు ముగుస్తుంది. లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ల పైన ఈ 5G రివల్యూషన్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది అమెజాన్. ఈ సేల్ చివరి రోజైన ఈరోజు ఐకూ లేటెస్ట్ పవర్ ఫుల్ 5G స్మార్ట్ iQOO Neo 6 5G ని తక్కువ ధరకే అందుకోవచ్చు. 

iQOO Neo 6 5G: అఫర్ ధర

స్నాప్డ్ డ్రాగన్ 870 పవర్ ఫుల్ ప్రొసెసర్ తో వచ్చిన ఈ ఫోన్ అమెజాన్ 5G రివల్యూషన్ సేల్ నుండి రూ. 24,999 ధరకే లభిస్తోంది. వాస్తవానికి, ముందుగా ఈ ఫోన్ రూ. 29,999 ధరతో సేల్ అయ్యేది. ఈ ఫోన్ ను అతి తక్కువ EMI మరియు No cost EMI అఫర్ తో కూడా కొనుగోలు చేసే వీలుంది. Buy From Here

ఏమిటి iQOO Neo 6 5G ప్రధాన ఆకర్షణలు

ఈ iQOO Neo 6 5G: స్మార్ట్ ఫోన్ 4K వీడియోలను 60fps వద్ద రికార్డ్ చెయ్యగల 64MP (OIS) Samsnung GW1P సెన్సార్ తో వస్తుంది. ఈ ఫోన్ 3.2 GHz క్లాక్ స్పీడ్ కలిగిన స్నాప్ డ్రాగన్ 870 5G చిప్ సెట్ తో పనిచేస్తుంది మరియు జతగా UFS 3.1 స్టోరేజ్ కూడా వుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10+  సపోర్ట్ కలిగిన E4 AMOLED డిస్ప్లే తో వస్తుంది. 

ఇక బ్యాటరీ మరియు అదనపు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 80W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4700 mAh బ్యాటరీ వుంది. అలాగే, ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 4D గేమింగ్, ఫన్ టచ్ OS సాఫ్ట్ వేర్ తో Android 12 OS వంటి ఫీచర్లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :