iQOO Neo 10R: సుందరమైన డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో వస్తోంది.!
ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ ప్రకటించింది
iQOO Neo Series నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది
ఫోన్ డిజైన్ వెల్లడించే టీజర్ ఇమేజ్ తో ఐకూ టీజింగ్ మొదలు పెట్టింది
iQOO Neo 10R: ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ ప్రకటించింది. 2024 చివరిలో క్వాల్కమ్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో iQOO 13 ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ప్రకటించిన ఐకూ, ఇప్పుడు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Neo నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ డిజైన్ వెల్లడించే టీజర్ ఇమేజ్ తో ఐకూ టీజింగ్ మొదలు పెట్టింది.
SurveyiQOO Neo 10R: లాంచ్
ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు ఇతర కీలక వివరాలు వెల్లడించే టీజర్ ఇమేజ్ ను మాత్రం రిలీజ్ చేసింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ ఐకూ ఫోన్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ వెల్లడయ్యాయి. ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తున్నట్లు కూడా ఐకూ అనౌన్స్ చేసింది.
iQOO Neo 10R: ఫీచర్స్
2024 ఫిబ్రవరి నెలలో ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత ఈ సిరీస్ నుంచి మరో ఫోన్ ను లాంచ్ చేయలేదు. అయితే, ఇప్పుడు ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ నుంచి వచ్చే నెక్స్ట్ ఫోన్ అని ప్రకటించింది. అంటే, సంవత్సరం తర్వాత ఈ సిరీస్ నుంచి కొత్త ఫోన్ ను విడుదల చేస్తోంది.

నియో సిరీస్ నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన అన్ని ఫోన్లు కూడా వాటి ధర మరియు ఫీచర్స్ పరంగా గుర్తింపు పొందాయి. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి వచ్చిన అన్ని ఫోన్లు కూడా Sony పవర్ ఫుల్ కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. ఇప్పుడు లాంచ్ చేయనున్న ఈ ఫోన్ కూడా గొప్ప Sony కెమెరా సెటప్ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఐకూ రిలీజ్ చేసిన ఈ అప్ కమింగ్ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ OIS కెమెరా మరియు స్లీక్ డిజైన్ ఉంటుందని కన్ఫర్మ్ అయ్యింది. అయితే, నియో 9 ప్రో తో పోలిస్తే కెమెరా డిజైన్ లో మార్పు చేసింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ను ర్యాగింగ్ బ్లూ అనే అందమైన కలర్ వేరియంట్ లో లాంచ్ చేస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది.
Also Read: 5 వేల బడ్జెట్ లో 200W Dolby Soundbar అందుకునే గొప్ప ఛాన్స్ అందించిన అమెజాన్.!
అంచనా ఫీచర్స్:
ఈ ఫోన్ ను Snapdragon 8s Gen 3 చిప్ సెట్ మరియు AMOLED డిస్ప్లే మరియు హెవీ బ్యాటరీ వంటి సెటప్ తో అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే , ఇవన్నీ కూడా కేవలం అంచనా ఫీచర్స్ గానే పరిగణించాలి. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి కంపెనీ ఎటువంటి వివరాలు ఇంకా బయటపెట్టలేదు.