iQOO 9T: 120W ఫాస్ట్ ఛార్జ్ మరియు స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 తో లాంచ్.!

iQOO 9T: 120W ఫాస్ట్ ఛార్జ్ మరియు స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 తో లాంచ్.!
HIGHLIGHTS

ఇటీవల ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లను ప్రకటించిన ఐకూ

ఇప్పుడు iQOO 9T ని విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ ప్రాసెసర్ గా పేరొందిన Snapdragon 8+ Gen 1 తో అందించింది

ఐకూ 9 సిరీస్ నుండి మరొక ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఇటీవల ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లను ప్రకటించిన ఐకూ ఇప్పుడు iQOO 9T ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm యొక్క ఫాస్ట్ ప్రాసెసర్ గా పేరొందిన Snapdragon 8+ Gen 1 తో అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా AI-ఆధారిత పనులను నిర్వహించడంలో సహాయపడే V1+ చిప్‌ను కూడా కలిగి ఉంది. మరి ఈ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను తెలుసుకుందామా.

iQOO 9T: ధర మరియు లాంచ్ ఆఫర్లు

iQOO 9T స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. బేసిక్ వేరియంట్ 8GB + 128GB ధర రూ.49,999 రూపాయలు మరియు హై ఎండ్ వేరియంట్ 12GB + 256GB ధర రూ.54,999 రూపాయలు. ఈ ఫోన్ ఈరోజు నుండే iQOO.com లో అందుబాటులోకి వస్తుంది. అయితే. ఆగష్టు 4 నుండి అమెజాన్ లో సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ పైన 4,000 రూపాయల వరకూ ICICI బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది. అలాగే, 12 నెలల No Cost EMI అప్షన్ కూడా వున్నాయి.

iQOO 9T: స్పెక్స్

iQOO 9T స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ తో 6.7-ఇంచ్ FHD+  AMOLED ప్యానెల్‌ను ఈ ఫోన్ కలిగివుంది. ఇది HDR10+ కి సపోర్ట్ చేస్తుంది మరియు360Hz టచ్ శాంప్లింగ్ సపోర్ట్ వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా LPDDR5 12GB ర్యామ్ మరియు UFS 3.1 కాన్ఫిగరేషన్ కలిగిన 256GB స్టోరేజ్ అప్షన్ లతో వస్తుంది.ఈ ఫోన్ Android 12 ఆధారితమైన FunTouchOs 12 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

ఈ ఫోన్ కెమెరాల విషయానికి వస్తే, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాసెటప్ వుంది. ఇందులో, OIS సపోర్ట్ తో 50MP మైన్ కెమెరా, 120-డిగ్రీ FOVతో 13MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 12MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఇందులో,

iQOO 9T లో స్టీరియో స్పీకర్లు, WiFi 6, బ్లూటూత్ 5.2 మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్‌ సెన్సార్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 4,700mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo