iQOO ప్రీమియం ఫోన్ పైన 13 వేల భారీ డిస్కౌంట్..బడ్జెట్ ధరకే అందుకోండి.!

HIGHLIGHTS

iQOO 9 5G పైన అమేజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది

Gimbal స్టెబిలైజేషన్ కలిగిన భారీ కెమేరా సెటప్ Smart Phone

iQOO 9 5G ఫోన్ ఎన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది

iQOO ప్రీమియం ఫోన్ iQOO 9 5G పైన అమేజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. అమేజాన్ అందించిన డిస్కౌంట్ దెబ్బకి ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ 30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. Gimbal స్టెబిలైజేషన్ కలిగిన భారీ కెమేరా సెటప్, స్నాప్ డ్రాగన్ ఫాస్ట్ 5G ప్రోసెసర్ మరియు మరిన్ని భారీ ఫీచర్లతో 43 వేల రూపాయల ధరలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు ఈరోజు అమేజాన్ నుండి అఫర్ ధరకే అందుకోవచ్చు.

ఐకూ ఇండియాలో భారీ ఫీచర్లతో 2022 ప్రారంభంలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయంలో రూ. 42,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు 13 రూపాయల భారీ డిస్కౌంట్ తో అమేజాన్ నుండి కేవలం రూ. 29,990 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ ఫోన్ యొక్క 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ హై ఎండ్ వేరియంట్ ను మీరు రూ. 33,990 ధరకే సొంతం చేసుకోవచ్చు.  ఈ ఫోన్ పైన భారీ ఎక్స్ చేంజ్ అఫర్ కూడా అమేజాన్ అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లతో ఈ ఫోన్ బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. Buy From Here                

ఏమిటి ఈ iQOO 9 5G ప్రత్యేకతలు?   

రేటు తగ్గింది సరే అసలు ఏమిటి ఈ iQOO 9 5G ప్రత్యేకతలు అని ఆలోచిస్తున్నారా? ఈ ఫోన్ ఈ ధరలో కాంప్రమైజ్ కానీ స్పెక్స్ మరియు ఫీచర్లు కలిగిన ఫోన్ అని ఖచ్చితంగా చెబుతాను. ఎందుకంటే, ఈ ఫోన్ క్వాల్కమ్ ఫాస్ట్ 5G ప్రోసెసర్ Snapdragon 888+ 5G శక్తితో పని చేసిస్తుంది మరియు జతగా 8/12GB ఫాస్ట్ ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో మీ గేమింగ్ ఎటువంటి ల్యాగ్ ఉండదు. దీనికి తగిన డిస్ప్లే కూడా ఈ ఫోన్ వుంది. 

ఈ ఫోన్ లో 120Hz 10Bit AMOLED డిస్ప్లే HDR 10+ సపోర్ట్ తో కలిగి వుంది మరియు విజువల్స్ ను మరింత అద్భుతంగా చూపించడం కోసం ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ కూడా వుంది. 120W ఫాస్ట్ ఛార్జ్ టెక్ తో ఈ ధరలో లభించే బెస్ట్ ఫోన్ ఇదే అని చెప్పవచ్చు. 

ఇక కెమేరా విభాగంలోకి వస్తే, ఈ ఫోన్ ఈ ప్రైస్ రేంజ్ లో Gimbal స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగిన ఫోన్ ఇదే. అంతేకాదు, ఇందులో 50MP సోనీ సెన్సార్, 13MP ప్రొఫెషనల్ 50mm కెమేరా సెటప్ తో స్టన్నింగ్ ఫోటోలను అందించ గలదు. ఈ ఫోన్ ప్రస్తుతం లభిస్తున్న అఫర్ ధరలో బెస్ట్ సెగ్మెంట్ ఫోన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :