అప్ కమింగ్ ఐ ఫోన్ 6S లీక్
ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఐ ఫోన్ 6S రిలీజ్ అవుతుంది. ఏదైనా మోడల్ లాంచ్ అవబోయే ముందు దాని పై రూమర్స్ ఎక్కువగా వినిపిస్తాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. రూమర్స్ కాదు ఏకంగా రియల్ ఫోటోలు లీక్ అవుతున్నాయి.
Surveyతాజాగా ఐ ఫోన్ అప్ కమింగ్ మోడల్ 6S యొక్క ఫ్రంట్ ప్యానల్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది. దీని డిజైన్ సేం ఐ ఫోన్ ప్రస్తుత మోడల్, 6 వలె ఉంది. ఇందులో నిరాశ పడవలసినది ఏమి లేదు. ఎందుకంటే ఆపిల్ ప్రతీ S సిరిస్ ను ముందు దాని ముందు మోడల్ డిజైన్ లోనే లాంచ్ చేసింది ఇప్పటి వరకూ.
3GS, 4S మరియు 5S అన్నీ వాటి predecessors లుక్స్ తోనే వచ్చాయి. కాని కొన్ని మైనర్ చేంజెస్ ఉన్నాయి అంతే. సో తాజగా లీక్ అయినవి నిజమని అనుకోవచ్చు. గతంలో ఆపిల్ ఐ ఫోన్ 6S లో ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను స్క్రీన్ లోనే జోడించి క్రింద ఉండే ఫిజికల్ రౌండ్ బటన్ తిసివేయనుంది అని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే అది ఈ లేటెస్ట్ లీక్ చుస్తే అబద్దమని స్పష్టం అవుతుంది.
Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile


