కేవలం రూ. 6,999 ధరకే 6,000mAh బ్యాటరీ, DTS సరౌండ్ సౌండ్ స్మార్ట్ ఫోన్

కేవలం రూ. 6,999 ధరకే 6,000mAh బ్యాటరీ, DTS సరౌండ్ సౌండ్ స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 స్మార్ట్ ఫోన్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేశారు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 స్మార్ట్ ఫోన్ DTS సరౌండ్ సౌండ్ సపోర్ట్ చేస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 లో పెద్ద 6,000 mAh బ్యాటరీ ఉంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4  స్మార్ట్ ఫోన్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేశారు. నవంబర్ 8 నుండి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సెల్. అయితే, Flipkart Big Diwali సేల్ సందర్భంగా,  ఈ ఫోన్ను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చు. Flipkart  నుండి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 సేల్ ఇప్పటికి Live గా వుంది. ఇన్ఫినిక్స్ ఈ సంవత్సరం మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లో విడుదల చేసింది.

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 స్మార్ట్ ఫోన్ ఓషన్ వేవ్, వైలెట్, క్వెట్జల్ సియాన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ అప్షన్లతో లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ధర: కేవలం 6,999 మాత్రమే.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ఫీచర్స్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 లో పెద్ద 6.82-అంగుళాల HD + డిస్ప్లే ఉంది. ఈ ఫోన్లోను డిస్ప్లేలో సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. అలాగే ఇన్ఫినిక్స్ నుండి ఈ కొత్త స్మార్ట్ ఫోన్   90.5% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి గల్ డిస్ప్లే తో ఉంటుంది. ఈ డిస్ప్లే 20.5: 9 యాస్పెక్ట్ రేషియో మరియు ఇది 2.5 డి కర్వ్డ్ గ్లాస్ తో తయారు చేయబడింది.

ఈ స్మార్ట్ ఫోన్  మీడియాటెక్ యొక్క హెలియో ఎ 22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ఫోనులో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి. అలాగే, ఒక డేడికేటెడ్ మెమరీ కార్డుతో 256GB వరకూ స్టోరేజ్ ని విస్తరించవచ్చు. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ లో రన్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, VoWiFi / VoLTE సపోర్ట్ మరియు DTS సరౌండ్ సౌండ్ సపోర్ట్ చేస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 కెమెరా కోసం 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇది ట్రిపుల్ ఎల్ఈడి ఫ్లాష్ తో వస్తుంది. ఫోన్ ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరాలో ఎఫ్ / 2.0, ఎఐ-పవర్డ్ బ్యూటీ మోడ్ మరియు మల్టి కెమెరా మోడ్ ఎపర్చరు ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 లో 6,000 mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ 5 వి 2 ఎ ఛార్జర్లో రన్ అవుతుంది. 100% ఛార్జ్ కావడానికి ఫోన్ 4 గంటల 10 నిమిషాలు పడుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo