Infinix Note 12: బడ్జెట్ 4GB+3GB వర్చువల్ ర్యామ్ ఫోన్ ఫస్ట్ సేల్..!!

Infinix Note 12: బడ్జెట్ 4GB+3GB వర్చువల్ ర్యామ్ ఫోన్ ఫస్ట్ సేల్..!!
HIGHLIGHTS

Infinix Note 12 స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ రేపు జరగనుంది

ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి రానుంది

33W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ వంటి మంచి ఫీచర్లను కలిగి వుంది

ఇన్ఫినిక్స్ రీసెంట్ గా ఇండియాలో ప్రకటించిన Infinix Note 12 స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ రేపు జరగనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి రానుంది మరియు మంచి ఆఫర్లు కూడా ఈ ఫోన్ పైన కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో అందించినా, ఈ ఫోన్ లో మాత్రం మంచి ఫీచర్లనే ఇన్ఫినిక్స్ అందించిందని చెప్పవచ్చు. ఎందుకంటే,ఈ ఫోన్  FHD+ AMOLED డిస్ప్లే, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ వంటి మంచి ఫీచర్లను కలిగి వుంది. మరి రేపు మొదటిసారిగా అమ్మకాలను కొనసాగించనున్న ఈ ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు, ధర మరియు స్పెక్స్ లను తెలుసుకుందామా.

Infinix Note 12: ధర & ఆఫర్లు

ఇన్ఫినిక్స్ నోట్ 12 రెండు వేరియంట్స్ లో లభిస్తుంది మరియు వాటి ధరలు క్రింద చూడవచ్చు.

Infinix Note 12 (4GB+64GB) ధర: రూ.11,999       

Infinix Note 12 (6GB+128GB) ధర: రూ.12,999

Axis బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 1,000 డిస్కౌంట్ మరియు అతి తక్కువ No Cost EMI అఫర్ ను కూడా జతచేసింది. ఈ ఫోన్ సేల్ మే 28 నుండి, అంటే రేపటి నుండి Flipkart ద్వారా సేల్ కి వస్తుంది.

Infinix Note 12: స్పెక్స్ మరియు ఫీచర్లు

ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD + రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 100% DCI P3 కలర్ గ్యాముట్, గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ అందిచడంతో పాటుగా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ Helio G88 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB/6GB తో పాటుగా 3GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగి వుంది మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేసింది.

Infinix Note 12 కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ మరియు AI లెన్స్ లను కలిగివుంది. ముందు భాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని డ్యూయల్ LED ఫ్లాష్ టి కలిగి వుంది. ఈ ఫోన్ లో టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కలిగిన భారీ 5,000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో DTS Surround Sound సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లను కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo