గేమింగ్ కోసం మరిన్ని కంట్రోల్స్ తో కొత్త GT 30 5G లాంచ్ చేస్తున్న Infinix

HIGHLIGHTS

Infinix ఇండియన్ గేమర్స్ కోసం మరిన్ని కంట్రోల్స్ కలిగిన కొత్త ఫోన్ GT 30 5G లాంచ్ చేస్తోంది

ఇన్ఫినిక్స్ AI సపోర్ట్ మరియు కాస్టమైజబుల్ మెచ్ లైట్ సెటప్ కూడా కలిగి ఉంటుంది

ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన వివరాలు ఇక్కడ అందిస్తున్నాను

గేమింగ్ కోసం మరిన్ని కంట్రోల్స్ తో కొత్త GT 30 5G లాంచ్ చేస్తున్న Infinix

చైనీస్ మొబైల్ మాన్యుఫ్యాక్చర్ కంపెనీ Infinix ఇండియన్ గేమర్స్ కోసం మరిన్ని కంట్రోల్స్ కలిగిన కొత్త ఫోన్ GT 30 5G లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ AI సపోర్ట్ మరియు కాస్టమైజబుల్ మెచ్ లైట్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన వివరాలు ఇక్కడ అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix GT 30 5G: లాంచ్ డేట్

ఇన్ఫినిక్స్ GT 30 5జి స్మార్ట్ ఫోన్ ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇండియాలో లాంచ్ చేయబడుతుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఇన్ఫినిక్స్ మరియు ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా అందించిన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు వెల్లడించాయి.

Infinix GT 30 5G: కీలక ఫీచర్లు

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ సైబర్ మెచా 2.0 ఫీచర్ తో లాంచ్ అవుతుంది. అంటే, ఇందులో కాస్టమైజబుల్ మెచ్ లైట్ సెటప్ ఉంటుంది మరియు ఇది 10 స్టయిల్స్ వరకు లైట్స్ మార్చుకునే సౌలభ్యం తో వస్తుంది. గేమింగ్ సమయంలో ఈ ఫోన్ లైట్స్ ఆటకు తగ్గట్టుగా లైట్స్ లయబద్దంగా వెలుగుతాయి. ఇది చూడటానికి ఆహ్లాదంగా వుండేలా చేస్తుంది.

Infinix GT 30 5G

ఇన్ఫినిక్స్ GT 30 5జి స్మార్ట్ ఫోన్ లో గేమింగ్ కోసం అవసరమైన షోల్డర్ బటన్స్ కూడా కలిగి ఉంటుంది. అంటే, ఇందులో ఇన్ స్క్రీన్ కంట్రోల్స్ తో పాటు ఫోన్ పై భాగంలో అదనపు కంట్రోల్ బటన్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 4nm ఆర్కిటెక్చర్ చిప్ సెట్ మరియు 7,79,000 కంటే అధిక AnTuTu స్కోర్ అందించే శక్తి కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ LPDDR5X ర్యామ్, 8GB అదనపు ర్యామ్ మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Also Read: GFF Sale సూపర్ డీల్: LG Smart Tv పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

ఇక గేమింగ్ ఫీచర్స్ విషయాన్ని వస్తే, ఈ ఫోన్ 90 FPS వద్ద BGMI గేమింగ్ సపోర్ట్ కలిగి ఉన్నట్లు క్రాఫ్టన్ యొక్క అఫీషియల్ సర్టిఫికేషన్ కలిగి ఉందని, ఇన్ఫినిక్స్ చెబుతోంది. దానికి తగిన అమోల్డ్ స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఇన్ఫినిక్స్ AI సపోర్ట్ కూడా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ నాటికి మరిన్ని స్పెక్స్ కూడా కంపెనీ అందించే అవకాశం ఉంది. కొత్త అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo