బడ్జెట్ ధరలో 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన infinix
ఈరోజు ఇండియాలో తన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది
Infinix Note 12 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో ఆవిష్కరించింది
ఈ ఫోన్ పైన లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది
Infinix ఈరోజు ఇండియాలో తన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. అదే, Infinix Note 12 5G మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 810 5G తో అందించింది. కేవలం 15 వేల రూపాయల సబ్ కేటగిరిలో ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో ఆవిష్కరించింది. ఇక ఇన్ఫినిక్స్ నోట్ 12 5జి లో అందించిన ఆకర్షనియమైన ఫీచర్ల విషయానికి వస్తే, 50MP, ట్రిపుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ మరియు AMOLED డిస్ప్లే వంటివి వున్నాయి. ఈ లేటెస్ట్ ఫోన్ యొక్క పూర్తి స్పెక్స్, ఫీచర్లు మరియు ధర వివరాలను క్రింద చూడవచ్చు.
SurveyInfinix Note 12: ధర మరియు ఆఫర్లు
ఇన్ఫినిక్స్ నోట్ 12 5G కేవలం 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో సింగిల్ వేరియంట్ లో లభిస్తుంది మరియు దీని ధర రూ.14,999. ఈ ఫోన్ పైన లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. లాంచ్ అఫర్ లో భాగంగా ఈ ఫోన్ ను Axis బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 1,500 డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. ఈ 5G ఫోన్ జూన్ 15 నుండి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులో ఉంటుంది.
Infinix Note 12 5G: స్పెక్స్ మరియు ఫీచర్లు
ఇన్ఫినిక్స్ నోట్ 12 5జి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD + రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 100% DCI P3 కలర్ గ్యాముట్, గరిష్టంగా 700 నిట్స్ బ్రైట్నెస్ అందిచడంతో పాటుగా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 810 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB తో పాటుగా 3GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగి వుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేసింది. డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ మెమోరిని 2TB వరకూ పెచుకోవచ్చు.
Infinix Note 12 5G కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ మరియు AI లెన్స్ లను కలిగివుంది. ముందు భాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని డ్యూయల్ LED ఫ్లాష్ ని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కలిగిన భారీ 5,000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో DTS Surround Sound సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లను కూడా అందించింది.