బడ్జెట్ 8GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ Infinix Hot 12 Pro మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో అతితక్కువ ధరలో 8GB హెవీ ర్యామ్ మరియు జతగా 5GB వర్చువల్ ర్యామ్ తో వచ్చిన మొదటి ఫోన్ గా నిలుస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో పాటుగా కేమెరా విభాగంలో కూడా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ఆగష్టు 8 న మొదటిసారిగా సేల్ కి వస్తోంది. అదే సమయలో Flipkart Big Saving Days జరుగుతోంది కాబట్టి ఈ ఫోన్ పైన చాలా ఆఫర్లు కూడా అందుకోవచ్చు.
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (6GB + 64GB) ధర కేవలం రూ.10,999 కాగా (8GB + 128GB) వేరియంట్ ధర రూ.11,999 రూపాయలు మాత్రమే. ఈ ఫోన్ ఆగష్టు 8 వ తేదీ నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ను ICICI మరియు Kotak కార్డ్స్ లేదా EMI అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ అఫర్ తో బేసిక్ వేరియంట్ ను కేవలం రూ.9,999 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు.
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన Unisoc T616 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగివుంది. అలాగే, ఇందులో 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా జతచేసింది.
కెమెరా విషయానికి వస్తే, హాట్ 12 ప్రో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే, పంచ్ హోల్ కటౌట్ లో 8ఎంపి సెల్ఫీని కూడా అందించింది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన భారీ 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా XOS సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.