మేడ్ ఇన్ ఇండియా ఎఫెక్ట్ : చైనాకి ధీటుగా Rs. 6,000 కంటే తక్కువ ధరకే LAVA స్మార్ట్ ఫోన్ విడుదల

HIGHLIGHTS

భారతీయ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ LAVA తన Z-సిరీస్ కింద సరికొత్త స్మార్ట్ ‌ఫోన్‌ను ప్రకటించింది.

Lava Z61 Pro అని పిలువబడే, ఈ స్మార్ట్‌ ఫోన్ కొంతకాలం క్రితం లాంచ్ అయిన Z 61 స్మార్ట్ ‌ఫోన్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్.

మేడ్ ఇన్ ఇండియా ఎఫెక్ట్ :  చైనాకి ధీటుగా Rs. 6,000 కంటే తక్కువ ధరకే LAVA స్మార్ట్ ఫోన్ విడుదల

భారతీయ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ LAVA తన Z-సిరీస్ కింద సరికొత్త స్మార్ట్ ‌ఫోన్‌ను ప్రకటించింది. Lava Z61 Pro అని పిలువబడే ఈ స్మార్ట్‌ ఫోన్ కొంతకాలం క్రితం లాంచ్ అయిన Z 61 స్మార్ట్ ‌ఫోన్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Z61 Pro ధర మరియు లభ్యత

లావా జెడ్ 61 ప్రో ధర రూ .5,774. ఈ స్మార్ట్ ఫోన్  మిడ్నైట్ బ్లూ మరియు అంబర్ రెడ్ అనే రెండు గ్రేడియంట్ ఫినిషింగ్ ఫినిషింగ్ తో లభిస్తుంది.

Lava Z61 Pro ఫీచర్లు 

లావా జెడ్ 61 ప్రో ఒక 18: 9 ఎస్పెక్ట్ రేషియా కలిగిన ఒక 5.45-అంగుళాల HD + డిస్ప్లేని ప్యాక్ చేస్తుంది. ఈ స్మార్ట్ ‌ఫోన్ ఒక 1.6GHz ఆక్టా-కోర్ SoC మరియు  ఇది 2GB RAM తో జత చేయబడింది.కానీ, ఈ ప్రాసెసర్ పేరును మాత్రం ప్రకటించలేదు. ఈ ఫోన్, ఒక 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటుగా వస్తుంది మరియు  దానిని 128GB వరకు పెంచుకునేందుకు వీలుంది. కెమేరాల విషయానికొస్తే, లావా జెడ్ 61 ప్రో వెనుక కేవలం సింగిల్ 8 MP కెమెరాను కలిగి ఉండగా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ కెమేరా ఉంటుంది. 

Lava Z61 Pro అధనపు ఫీచర్లు

ఇతర కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే, పోర్ట్రెయిట్ మోడ్, Burst మోడ్, పనోరమా, అంతర్నిర్మిత ఫిల్టర్లు, బ్యూటీ మోడ్, HDR  మరియు నైట్ మోడ్ వంటివి ఉన్నాయి. ఇది ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను కూడా అందిస్తుంది, ఇది ఈ ఫోన్‌ను కేవలం 0.6 సెకన్లలోనే అన్‌లాక్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ ‌ఫోన్‌లో బ్లూటూత్ 4.2, Wi-Fi , జిపిఎస్, డ్యూయల్ సిమ్, OTG  సపోర్ట్ మరియు మైక్రో యుఎస్‌బి పోర్ట్ ఉన్నాయి.

Lava Z61 Pro గురించి Lava మాటల్లో..    

లావా ఇంటర్నేషనల్ హెడ్-ప్రొడక్ట్ తేజిందర్ సింగ్ ఒక ప్రకటనలో, “భారతీయ బ్రాండ్‌గా, సమాజంలోని ప్రతి విభాగానికి ఉత్పత్తి ప్రతిపాదనలను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. లావా జెడ్ 61 ప్రో నిజంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ స్మార్ట్‌ ఫోన్. ఇది అతుకులు లేని పనితీరును మాత్రమే కాకుండా ఎంట్రీ లెవల్ విభాగంలో చాలా ఆకర్షణీయమైన రూపాన్ని కూడా అందిస్తుంది. ముఖ్యంగా మీకు # ప్రౌడ్లీ ఇండియన్ అనిపించేలా చేయడానికి ఇది సరైన ఫోన్. ” అని పేర్కొన్నారు. 

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile