Price Cut: వన్ ప్లస్ 11R పై రూ. 12,000 భారీ తగ్గింపు.!
వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 11R పై భారీ తగ్గింపు
11R భారీ డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ ధరలోనే లభిస్తోంది
ఈ ఫోన్ ను ప్రస్తుతం అమెజాన్ నుండి ఈ డిస్కౌంట్ ధరకే పొందవచ్చు
Price Cut: వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 11R పై భారీ తగ్గింపు లభిస్తోంది. 40 వేల ధరలో ఇండియాలో విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ ధరలోనే లభిస్తోంది. గడిచిన సమ్మర్ సేల్ తర్వాత, ఇప్పుడు మరొకసారి ఈ ఫోన్ మరింత చవక ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ లో సోనీ కెమెరా సెటప్ మొదలుకొని ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ వరకు చాలా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
SurveyPrice Cut: వన్ ప్లస్ 11R 5G
వన్ ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 39,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పైన అమెజాన్ ఇండియా రూ. 12,000 ప్రకటించింది. అందుకే ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుండి రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ను ప్రస్తుతం అమెజాన్ నుండి ఈ డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. Buy From Here
ఈ ఫోన్ ప్రస్తుతం లభిస్తున్న డిస్కౌంట్ ధరలో మంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్, కెమెరా మరియు ఛార్జ్ టెక్ పరంగా ఈ ధరలో గొప్ప ఆప్షన్ అవుతుంది. మరి ఈ ఫోన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ఫీచర్స్ ఏమిటో కూడా తెలుసుకోండి.
Also Read: Realme GT6 స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!
వన్ ప్లస్ 11R: ఫీచర్లు
వన్ ప్లస్ 11R స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ సెట్ మరియు 8GB LPDDR5X RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 50MP Sony IMX 890 మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో సెన్సార్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ కెమెరాతో అల్ట్రా HDR ఫోటోలు విడీఓలను షూట్ చేయవచ్చు. అలాగే ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.

ఈ ఫోన్ ను 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో వన్ ప్లస్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో గొప్ప డిస్ప్లే కూడా వుంది. 6.7 ఇంచ్ సూపర్ ఫ్లూయిడ్ AMAOLED డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ తో ఈ ఫోన్ కలిగి వుంది. ఈ స్క్రీన్ HDR 10+ సపోర్ట్, 10 బిట్ కలర్ డెప్త్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile