Flipkart దివాళీ సేల్ నుంచి POCO M2 PRO తక్కువ ధరకే లభిస్తోంది

HIGHLIGHTS

Flipkart బిగ్ దివాళీ డేస్ సేల్ ఇప్పటికే మొదలయ్యింది.

ఈ Flipkart సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన భారీ ఆఫర్లను ప్రకటించింది.

Flipkart దివాళీ సేల్ నుంచి POCO M2 PRO స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆఫర్లు

Flipkart దివాళీ సేల్ నుంచి POCO M2 PRO తక్కువ ధరకే లభిస్తోంది

Flipkart బిగ్ దివాళీ డేస్ సేల్ ఇప్పటికే మొదలయ్యింది. ఈ Flipkart సేల్ నుండి స్మార్ట్  ఫోన్ల పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా, Flipkart లోని స్మార్ట్ ఫోన్ విభాగంలో మంచి రేటింగుతో కొనసాగుతున్న POCO M2 PRO స్మార్ట్ ఫోన్ ఈ సేల్ నుంచి డిస్కౌంట్ ధరతో అమ్ముడవుతోంది. ముందుగా, రూ.13,999 రుపాయల ధరలో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ స్మార్ట్ ఫోన్, Flipkart బిగ్ దివాళీ డేస్ సేల్ నుంచి తక్కువ ధరకే లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

POCO M2 PRO స్మార్ట్ ఫోన్ మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్,  Flipkart దివాళీ సేల్ నుండి 1000 డిస్కౌంట్ అందుకొని కేవలం రూ.12,999 రుపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అధనంగా, Axis బ్యాంక్ డెబిట్/క్రెడిట్  కార్డుతో POCO M2 Pro స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు డిస్కౌంట్ అందుతుంది. అంటే, డబుల్ బెనిఫిట్ తో చాలా తక్కువ ధరకే ఈ POCO M2 Pro స్మార్ట్ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే, అని ఇతర బ్యాంకుల డెబిట్/క్రెడిట్  కార్డుతో POCO M2 Pro స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే 5% తక్షణ డిస్కౌంట్ ని కూడా అఫర్ చేస్తోంది. అయితే, ఈ అఫర్ ని లిమిటెడ్ పిరియడ్ అఫర్ మాత్రమే.      

Poco M2 Pro Specs

ఈ Poco M2 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో తీసుకొచ్చింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 పొరతో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్  ఉంది మరియు 209 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 8.8 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జి ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్  ఎంపికలతో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10-ఆధారిత MIUI 11 పై పోకో లాంచర్తో నడుస్తుంది. ఈఫోనే మరింత స్టోరేజి విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డును కలిగి ఉంది.

పోకో M2 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని f / 1.8 ఎపర్చరుతో, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ తో , 5MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ కలుపుకుంది. వెనుక కెమెరాలు 4K UHD రీకార్డింగ్ ని 30FPS వద్ద మరియు స్లో-మోషన్ వీడియోలను HD లో 960FPS వరకు షూట్ చేయగలవు. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 16 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo