హువావే P 30 మరియు P 30 ప్రో ప్రత్యేకతలు చూస్తే నివ్వెరపోతారు
వీటిలో అందించిన కెమేరాతో 50 రెట్ల డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు.
అనేక లీక్స్ మరియు రూమర్ల తరువాత, ఎట్టకేలకు Huawei పారిస్ కన్వెన్షన్ సెంటర్, ఫ్రాన్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో Huawei P30 మరియు P30 ప్రో స్మార్ట్ ఫోన్లను ప్రారంభించింది. ఊహించిన విధంగా, ఈ ఫోన్లు " ఫోటోగ్రఫీ రికార్డులు బద్దలు కొట్టనుంది" మరియు "శక్తివంతమైన వీడియోగ్రఫీ" ని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి ఈ చైనీస్ టెక్ దిగ్గజం Huawei P30 సిరీస్ ఫోన్లు ఇప్పటివరకు వచ్చిన వాటిలో చాలా అడ్వాన్సుడ్ కెమేరా కలిగి వున్నాయి మరియు ప్రొఫెషనల్ కెమేరాలతో కూడా పడేలా ఉంటాయి అని చెప్పారు. ఈ ఫోన్లు సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్, ఒక ఆప్టికల్ సూపర్ జూమ్ లెన్స్ మరియు టైం ఆఫ్ ఫ్లయిట్ (TOF) కెమెరాతో కలగలుపుగా వస్తాయి. ఈ లెన్సులు మంచి OIS మరియు AIS ఇమేజ్ స్టెబిలిజేషన్ టెక్నాలజీని కలిగి ఉన్నాయని కూడా పేర్కొన్నారు.
Surveyకెమెరా
Huawei p30, ఒక 40MP ప్రధాన కెమెరా సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్ మరియు లెన్స్ కలిగి ఒక f1.8 అపర్చరుతో వుంటుంది మరియు ఒక f2.2 అపర్చరు గల 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకా f2.4 అపర్చరుతో ఒక 8MP టెలిఫోటో కెమెరాతో సహా ఒక Leica ట్రిపుల్ కెమెరా వ్యవస్థను అమర్చారు . ముందు AI HDR + తో ఒక 32MP కెమెరాను అందించారు. ఇక హువావే P30 ప్రో విషయానికి వస్తే, ఇది ఒక Leica క్వాడ్ కెమెరా సెటప్పుతో వస్తుంది. ఇందులో f1.6 అపర్చరు యాగాల ఒక 40MP ప్రధాన కెమెరా, f2.2 అపర్చరు గల ఒక 20MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, f3.4 అపర్చరు గల ఒక 8MP 5X టెలిఫోటో కెమెరా మరియు ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్ (TOF) కెమెరా, AI HDR + ఒక 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
ఈ రెండు ఫోన్లు సాధారణ వాటికంటే భిన్నమైన బేయర్ ఫిల్టర్లను కలిగివుంది. ఇవి ఒక 1 / 1.7-అంగుళాల Huawei SuperSpectrum సెన్సార్ తో వస్తాయి. RGBG బేయర్ ఫిల్టర్, సంప్రదాయ సెన్సార్ల వలనే కాకుండా, సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్ ఆకుపచ్చ పిక్సెళ్ళ స్థానములో పసుపు పిక్సెళ్ళను కలిగివున్న RYYB ఫిల్టర్ ఉంది. దీనికారణంగా, ఈ సెన్సార్ 40 శాతం ఎక్కువ కాంతిని అనుమతిస్తుందని, హువావే తెలిపింది. అలాగే, Huawei p30 మరియు Huawei p30 ప్రో వరుసగా 204.800 మరియు 409.600 అధిక గరిష్ట ISO రేటింగ్ అందిస్తాయని పేర్కొంది.
హువావే సూపర్ జూమ్ లెన్స్ 3X ఆప్టికల్ జూమ్, 5X హైబ్రిడ్ జూమ్ మరియు ఈ P30 సీరీస్ ఫోన్లలో 50X రెట్లు డిజిటల్ జూమ్ (30x రెట్లు P 30), మద్దతునిస్తాయి. రెండు ఫోన్లు కూడా AIS మరియు OIS కలిగివున్నాయి, ఒక Telephoto లెన్స్ ద్వారా ఫోటో క్లిక్ చేసినప్పుడు తక్కువ కాంతి పరిస్థితులలో కూడా స్థిరమైన షాట్ మరియు ప్రకాశవంతంగా అందిస్తుంది. రెండు ఫోన్లు, ఫ్లాష్, కలర్ టెంపరేచర్ మరియు ఫ్లికర్ సెన్సార్లను కలిగిఉంటాయి. అయితే, P30 అధనంగా ఒక లేజర్ ట్రాన్స్మిటర్ మరియు లేజర్ రిసీవర్ తో వస్తుంది.
