48MP కెమేరా, పంచ్ హోల్ డిస్ప్లే తో ఇండియాలో విడుదలైన Honor View 20 : ధర,స్పెక్స్ మరియు పూర్తి వివరాలు

48MP కెమేరా, పంచ్ హోల్ డిస్ప్లే తో ఇండియాలో విడుదలైన Honor View 20 : ధర,స్పెక్స్ మరియు పూర్తి వివరాలు
HIGHLIGHTS

జనవరి 31వ తేది 12 pm వద్ద Amazon.in, hihonor.in ద్వారా అందుబాటులో ఉంటుంది.

ప్రపంచ ఆవిష్కరణ తరువాత, హానర్ దాని తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి,  హానర్ వ్యూ 20 ని  ఈరోజు భారతదేశం లో ప్రారంభించింది. ఈ కొత్త హ్యాండ్ సెట్ ఒక పంచ్ హోల్ డిస్ప్లే రూపకల్పన మరియు డిస్ప్లేలో నోచ్ లేకుండా వచ్చింది. ఇది ఒక డ్యూయల్ – రియర్ కెమెరా సెటప్పుతో వస్తుంది మరియు ఇది భారతదేశంలో, 48MP ప్రధాన కెమెరా సెన్సార్ను కలిగివున్నమొట్టమొదటి ఫోన్ మరియు ఒక పంచ్ హోల్ కెమెరాతో వచ్చిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. ఈ హ్యాండ్ సెట్ 'లింక్ టర్బో' టెక్నాలజీని కలిగి ఉంది, దీనివలన Wi-Fi మరియు సెల్యులార్ వేగవంతమైన డౌన్లోడ్ స్పీడ్ కనెక్టివిటీని పెంచుతుందని కంపెనీ చెబుతోంది.

హానర్ వ్యూ 20 ప్రత్యేకతలు

ఆక్టా – కోర్ HiSilicon కిరణ్ 980 చిప్సెట్ తో, హానర్ వ్యూ 20 వస్తుంది, ఇది 7nm ప్రాసెస్ ఉపయోగించి తయారు చేసిన సంస్థ యొక్క ప్రధాన చిప్సెట్. చైనాలో పలు వేరియంట్లలో ఈ హ్యాండ్సెట్ ప్రకటించబడినప్పటికీ, భారతదేశంలో  6GB RAM మరియు 128GB స్టోరేజితో పాటు మరో 8GB RAM మరియు 256GB స్టోరేజితో కలిపి రెండు వేరియంట్లులో లభిస్తాయి. ఇది GPU టర్బో 2.0 టెక్నాలజీని కలిగి ఉంది, ఇది గేమింగ్ సమయంలో  గ్రాఫిక్స్ మరియు దాని ఫోన్ల పనితీరును మెరుగుపరుస్తాయని కంపెనీ వాదనలు. వ్యూ 20 కూడా లిక్విడ్ కూలింగ్ సిస్టం కలిగి ఉంటుంది, ఇది CPU ఉష్ణోగ్రతను సరైన స్థాయిలో ఉంచడానికి సహాయపడుతుంది.

డిస్ప్లే విషయానికివస్తే , ఈ హానర్ వ్యూ 20 ఒక 6.4-అంగుళాల పూర్తి HD + ఆల్-వ్యూ డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 2310x1080p రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇందులోని డిస్ప్లే దాదాపు బెజెల్స్-తక్కువగా ఉంటుంది, అయితే ఇది సెల్ఫీ సెన్సార్ను కలిగి ఉన్న ఒక పంచ్ హోల్ కలిగి ఉంటుంది. ఎగువ ఎడమ మూలలో గుండ్రని కోత 4.5mm వ్యాసంతో ఉంటుందని హువావే చెప్పింది. వేలిముద్ర సెన్సారుతో పాటు V- ఆకారపు నమూనాను కలిగి ఉన్న ఒక గాజు ప్యానెల్ వెనుక ఉంది.

Honor View 20_intext_2.jpg

ఇక కెమెరా విభాగంలో, ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ – వెనుక కెమెరా సెటప్పుతో వస్తుంది. ఇక్కడ కెమెరాల్లో, ఒకటి ఒక 48MP సోనీ IMX586 CMOS ప్రాధమిక సెన్సార్, ఇది 1/2 అంగుళాల CMOS తో ఉంది, ఇది 4-in-1 పిక్సెల్-బిన్నింగ్, 1.6-మైక్రాన్ పిక్సెల్ను అందించడానికి ఉపయోగిస్తుంది. రెండవ సెన్సార్ అనేది టైం -ఆఫ్-ఫ్లైట్ (TOF) 3D సెన్సార్, ఇది డెప్త్ ని ఒడిసిపట్టుకోవడానికి ఉపయోగించబడుతుంది. ముందు, పంచ్ హోల్ కెమెరా f /2.0 ఎపర్చరుతో 25MP సెన్సారును  కలిగి ఉంది. ఒక 5V, 4A వద్ద సూపర్ చార్జింగుకు మద్దతు ఇచ్చే 4000 mAh బ్యాటరీతో వస్తుంది మరియు కేవలం 30 నిమిషాలు ఫోన్ ఛార్జింగుతో  ఒక రోజు పూర్తి  వినియోగాన్ని అందిస్తుందని,  సంస్థ వాదనలు చెబుతున్నాయి.

Honor View 20_intext_4.jpg

ఈ ఫోన్,  Android పై 9.0 ఆధారితంగా మేజిక్ UI 2.0 తో నడుస్తుంది మరియు అధిక స్థాన ఖచ్చితత్వాన్ని బట్వాడా చేయగల డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPS ఫీచర్ను కూడా ఉపయోగిస్తుంది. ఈ వ్యూ 20 కూడా USB లేదా Wi-Fi ద్వారా PC కి కనెక్ట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది, ఇందులో ఒక PC మోడ్ వస్తుంది.

హానర్ వాచ్ మ్యాజిక్ అండ్ హానర్ బ్యాండ్ 4 రన్నింగ్ ఎడిషన్

ఈ కార్యక్రమంలో, హానర్ తన వాచ్ మాజిక్ బ్యాండ్ స్మార్ట్ వాచ్ని కూడా ప్రకటించింది. ఈ పరికరం HD AMOLED టచ్ స్క్రీన్ డిస్ప్లేని కలిగి ఉంది మరియు 50m వరకు నీటి నిరోధకతను కూడా కలిగి ఉంది. ఇది రోజంతా రియల్ -టైం హృదయ పర్యవేక్షణను కలిగి ఉంది మరియు పూర్తి ఛార్జ్ తో 7 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది లావా బ్లాక్ మరియు మూన్లైట్ సిల్వర్ కలర్ నమూనాలలో అందుబాటులో ఉంటుంది.

Honor smart watches intext.jpg

హానర్ బ్యాండ్ 4 , ఈ పరికరం 2018 లో భారతదేశంలో అందుబాటులో ఉంది. అయితే, ఇది 50 మీటర్ల వరకు నీటిని నిరోధించేల చేసిన ఈ డివైజ్ యొక్క కొత్త రన్నింగ్ ఎడిషన్. ఇది రన్నింగ్ పర్యవేక్షణ మరియు రెండు వేరియంట్ మోడ్లలో వస్తుంది. ఇది ఒక POLED మోనోక్రోమ్ డిస్ప్లేను కలిగి ఉంది మరియు 77 mAh బ్యాటరీని కలిగి ఉంది.

హానర్ వ్యూ 20 ధర

ఈ హానర్ వ్యూ 20 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6GB RAM మరియు 128GB అంతర్గత మెమొరీతో కలిపి రూ .37,999 ధరతో వస్తుంది . మరొక 8GB RAM / 256GB స్టోరేజి వెర్షన్ రూ 45,999 ధరతో వస్తుంది. ఇది ఫాంటమ్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు సఫైర్ బ్లూ రంగు మోడళ్లలో లభిస్తుంది మరియు జనవరి 31 నుండి 12 pm సమయం వద్ద Amazon.in, hihonor.in ద్వారా అందుబాటులో ఉంటుంది. అలాగే, దీనిని రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఆఫ్లైన్లో ద్వారా కూడా  కొనుగోలు చేయవచ్చు. ICICI డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించి EMI పై ఫోన్ కొనుగోలు చేసిన వారికి 5 శాతం తక్షణ డిస్కౌంట్ అందుతుంది.

హానర్ వాచ్ మేజిక్ ధర రూ. 13,999 మరియు లావా బ్లాక్ మరియు మూన్లైట్ సిల్వర్ కలర్ మోడల్స్ కోసం రూ .14,999 ధరతో ఉంటుంది. హానర్ బ్యాండ్ 4 రన్నింగ్ ఎడిషన్ ధర రూ. 1,599.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo