Honor Magic 6 Pro: ఈరోజు భారత్ లో విడుదలైన హానర్ పవర్ ఫుల్ ఫోన్.!
Honor Magic 6 Pro: 2024 ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్ లో పవర్ ఫుల్ ఫీచర్స్ తో హానర్ విడుదల చేసిన హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో కూడా లాంచ్ చేయబడింది. ఈ హానర్ ఫోన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన DXOMARK 2024 గోల్డ్ లేబుల్స్ ను పొందిన ఫోన్ గా మార్కెట్ లో నిలిచింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని కెమెరా మరియు బ్యాటరీ వరకు అన్ని విభాగాల్లో కూడా గొప్ప ఫీచర్స్ ను కలిగి ఉందని కంపెనీ గొప్ప తెలిపింది.
SurveyHonor Magic 6 Pro: ధర
హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ ను 12GB + 512GB సింగల్ వేరియంట్ లో రూ. 89,999 ధరతో ఇండియా లో విడుదల చేసింది. ఈ ఫోన్ అమెజాన్, ప్రధాన రిటైల్ స్టోర్స్ మరియు హానర్ ఇండియా అధికారిక వెబ్సైట్ నుంచి ఆగస్టు 15వ తేదీ నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది.
ఆఫర్స్
హానర్ మ్యాజిక్ 6 ప్రో లాంచ్ లో భాగంగా గొప్ప ఆఫర్లు కూడా హానర్ అందించింది. ఈ ఫోన్ పైన 12 నెలల No Cost EMI ఆఫర్ ను అందించింది.
Also Read: Myntra నుంచి మంచి డిస్కౌంట్ తో రూ. 1,000 లోపు లభిస్తున్న Bluetooth Speaker డీల్స్ ఇవే.!
Honor Magic 6 Pro: ఫీచర్స్
హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ నానో క్రిస్టల్ షీల్డ్ రక్షణ కలిగిన 6.80 ఇంచ్ LTPO స్క్రీన్ తో వచ్చింది. ఈ స్క్రీన్ 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR Vivid మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 పవర్ ఫుల్ చిప్ సెట్ తో పని చేస్తుంది. దానికి జతగా 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

ఈ హానర్ ఫోన్ సెక్యూరిటీ కోసం HDS చిప్ సెట్, నెట్ వర్క్ Honor C1+ మరియు పవర్ మేనేజ్మెంట్ కోసం హానర్ E1 చిప్ సెట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 2.5 ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగిన 180MP పెరిస్కోప్ సెన్సార్ + 50MP హానర్ ఫాల్కన్ సెన్సార్ + 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 50MP + 3D డెప్త్ సెన్సింగ్ లతో డ్యూయల్ సెల్ఫీ కెమెరా వుంది.
ఈ ఫోన్ లో 5600 mAh హెవీ బ్యాటరీ ఉంది మరియు ఇది 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ 66W వైర్లెస్ సూపర్ ఛార్జ్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ హానర్ యొక్క Magic OS 8.0 OS పై నడుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
