ఇండియాలో Honor 9X Pro మే 12 న విడుదల కానుంది
ఈ మొబైల్ ఫోన్ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇండియాలో అమ్మకానికి తీసుకురానున్నట్లు చెబుతోంది
హానర్ 9 ఎక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ను మే 12 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇండియాలో అమ్మకానికి తీసుకురానున్నట్లు చెబుతోంది. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్ ధర రూ .15 వేల నుంచి రూ .20 వేల మధ్య ఉండబోతోందని కూడా తెలుస్తోంది. ఈ హానర్ ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ ఫిబ్రవరిలో ప్రారంభించబడింది.
Survey
Whatever you are passionate about, get the speed you need with the Kirin 810. #UpforEXtraordinary
Watch out this space for more updates. pic.twitter.com/dTVWnfLc1u— Honor India (@HiHonorIndia) May 7, 2020
హానర్ 9 ఎక్స్ ప్రో స్మార్ట్ ఫోన్‌లో కిరిన్ 810 చిప్‌సెట్‌ను పొందబోతున్నారు, ఇది కాకుండా, ఈ స్మార్ట్ ఫోన్‌లో మీకు 8 జీబీ ర్యామ్‌తో 256 GB స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఈ ఫోనులో ఒక 6.59-అంగుళాల FHD + నోచ్ లెస్ స్క్రీన్ వుంటుంది. దీనికి తోడు ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో, ఒక 4000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని అఫర్ చేస్తోంది. ఈ బ్యాటరీతో మీకు 10W ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది, అంతేకాకుండా ఈ ఫోన్ను ఆండ్రాయిడ్ 10 ఆధారితమైన EMUI 10 లో ప్రారంభించవచ్చు.
ఈ హానర్ 9 ఎక్స్ ప్రో లో 16 MP సెల్ఫీ కెమెరా ఉండనుంది , మీరు దానిని పాప్-అప్ మెకానిజంతో పొందుతారు, దీనికి తోడు ఇందులో ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా పొందుతారు. ఈ ట్రిపుల్ కెమెరాలో ఒక ప్రధాన 48MP లభిస్తుంది. ఇది కాకుండా, ఒక 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ కూడా జతగా వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
