డ్యూ-డ్రాప్ నోచ్ మరియు AI కెమెరాలతో విడుదలకానున్న Honor 10 Lite

డ్యూ-డ్రాప్ నోచ్ మరియు AI కెమెరాలతో విడుదలకానున్న Honor 10 Lite
HIGHLIGHTS

జనవరి 15 న, హువావే యొక్క ఉప బ్రాండ్ అయినటువంటి హానర్ తన 10 లైట్ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

జనవరి 15 న, హువావే యొక్క ఉప బ్రాండ్ అయినటువంటి హానర్ తన 10 లైట్ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా, ఈ సంస్థ దానికి సంబంధించి మీడియాకు ఆహ్వానాలను కూడా పంపింది మరియు ఫ్లిప్ కార్ట్  మైక్రోసాైట్లో ఈ స్మార్ట్ ఫోన్నుజాబితా కూడా చేసింది. ఈ స్మార్ట్ ఫోన్  ఇప్పటికే చైనాలో ప్రారంభించబడింది మరియు ఒక డ్యూ-డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఇది 91 శాతం స్క్రీన్ -టూ-బాడీ నిష్పత్తిని పొందడానికి ఒక సాధారణ నోచ్ తో, ఈ సంస్థ నుండి భారతదేశంలో ప్రవేశపెట్టనున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్.

ఇది హానర్ 9 లైట్  యొక్క వారసుడుగా, ఈ హానర్ 10 లైట్ కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత కెమెరాను కలిగి ఉంటుంది. చైనాలో మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెట్టారు, కానీ ఫ్లిప్ కార్ట్ లిస్టింగ్ ప్రకారం, కంపెనీ 4G RAM RAM మరియు 64 GB స్టోరేజి వేరియంట్ను భారతదేశంలో ప్రవేశపెట్టవచ్చని  సూచిస్తుంది. ఈ ఫోన్ ఎరుపు, నీలం, నలుపు మరియు తెలుపు, వంటి నాలుగు రంగులలో తీసుకువచ్చారు,కానీ  ఫ్లిప్ కార్టులో మాత్రం,గ్రేడియంట్ కలరుతో వుండే ఒక స్కై బ్లూ వేరియంటుతో పాటుగా మూడు రంగులు మాత్రమే కనిపిస్తాయి.

Honor 10 Lite - BYD cover.jpg

హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్లను

ఈ హానర్ 10 లైట్ ఒక 6.51 అంగుళాల IPS LCD ఫుల్ HD + డిస్ప్లేను, 2280 x 1080 పిక్సెళ్లతో 19.5: 9 ఆస్పెక్ట్ రేషియాతో అందిస్తుంది.  ఈ డివైజ్  HiSilicon Kirin 710 చిప్సెట్ను కలిగివుంది. అయితే, 16nm కిరిన్ 659 తో పోలిస్తే, ఈ కిరిన్ 710 సింగిల్ కోర్ యొక్క పనితీరు కిరిన్ 659 కంటే 75 శాతం అధికంగా నిలుస్తోందని ఈ సంస్థ చెబుతోంది. ఈ కిరిన్ 710ప్రాసెసర్, కిరిన్ 659 కంటే విద్యుత్ వినియోగం మరియు పెరఫార్మెన్స్ లో అభివృద్ధి సాధించింది మరియు ఇది Antutu పైన 131733 పాయింట్లు సాధించింది.

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక ప్యానెల్లో వేలిముద్ర సెన్సార్ను కలిగివుంటుంది. కెమెరా విభాగంలో, ఈ ఫోన్ 13MP ప్రాధమిక సెన్సార్ మరియు ఒక 2MP సెకండరీ సెన్సారుతో, వెనుక డ్యూయల్-కెమెరా సెటప్పును కలిగివుంటుంది. సెల్ఫీ కోసం, AI సామర్థ్యాలతో 24MP ముందు షూటర్ ఉంది. ఈ డివైజ్  GPU టర్బోతో వస్తుంది, ఇది 60 శాతం వరకు గ్రాఫిక్స్ పనితీరు మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ మొత్తం ప్యాకేజీ, ఒక 3,400mAh బ్యాటరీతో శక్తిని కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo