నోకియా 5.1 ప్లస్ మరియు నోకియా 6.1 ప్లస్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన HMD గ్లోబల్

నోకియా 5.1 ప్లస్ మరియు నోకియా 6.1 ప్లస్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన HMD గ్లోబల్

HMD గ్లోబల్ ఇటీవలే తన నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అందుకే కావచ్చు, మున్దునుండి అందుబాటులోవున్నస్మార్ట్ ఫోనులైనటువంటి నోకియా 5.1 ప్లస్ మరియు నోకియా 6.1 ప్లస్ పైన రూ. 1750 డిస్కౌంట్  ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ డిస్కౌంట్ అందుకోవాలంటే, nokia యొక్క ఇండియా ఆన్లైన్ స్టోర్ నుండి ఈ ఫోన్లను కొనేప్పుడు 'DEAL1750' అనే ప్రోమో కోడ్ అప్లై చేయాల్సివుంటుంది.

ఈ విషయాన్ని ముందుగా NPU ద్వారా తెలియవచ్చింది. అయితే, ఈ రెదను స్మార్ట్ ఫోన్ల యొక్క బేస్ వేరియంట్లకు మాత్రమే ఈ ఆఫరును వర్తింప చేసినట్లు తెలుస్తోంది. అంటే, నోకియా 5.1 ప్లస్ యొక్క 3GB వేరియంట్ మరియు నోకియా 6.1 యొక్క 4GB వేరియంట్ పైన ఈ డిస్కౌంట్ ఆఫరును వర్తింపచేసింది.

Nokia 5.1 Plus

ఈ నోకియా 5.1 ప్లస్ ఒక 5.86 అంగుళాల HD + డిస్ప్లేను 19: 9 యొక్క యాస్పెక్ట్ రేషియాతో మరియు 84 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది . ఈ ఫోన్ ఒక 3 జీబి RAM తో  ఒక మీడియా టెక్ హీలియో P60 చిప్సెట్ శక్తిని కలిగి ఉంది మరియు 32GB అంతర్గత  స్టోరేజితో లభిస్తుంది, ఇది 256GB వరకు మెమోరిని పెంచుకోవడానికి  ఎంపికను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక f / 2.0 ఎపర్చరుతో 13MP + 5MP లెన్సులతో డ్యూయల్ – రియర్ కెమెరా సెటప్ ఉంటుంది మరియు ముందు భాగంలో, f / 2.2 ఎపర్చర్ మరియు 80.4-డిగ్రీ కోణం వీక్షణతో 8MP యూనిట్ ఉంది.                 

Nokia 6.1 Plus

 ఈ ఫోన్లో ఒక 5.8 అంగుళాల FHD + (2280×1080) డిస్ప్లే ఉంది, ఇది19: 9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంది మరియు  గొరిల్లా గ్లాస్ 3 డివైజ్ ముందు మరియు వెనుక భాగంలో అమర్చబడింది. ఈ నోకియా 6.1 ప్లస్ ఫోన్ ఒక ఆక్టా కోర్ స్నాప్డ్రాగెన్ 636 చిప్సెట్, 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 400 జీబికి పెంచుకోవడం లాంటి సౌకర్యాలనిస్తుంది. నోకియా 6.1 ప్లస్ కూడా ఒక Android One కలిగిన  డివైజ్, ఈ డివైజ్ భద్రతా అప్డేట్లను ముందుగా పొందుతుంది  నోకియా 6.1 ప్లస్ మరియు 5.1 ప్లస్ రెండూ Google లెన్స్ తో వస్తాయి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo