ఇండియాలో విడుదలైన NOKIA C2 ఎంట్రీ లెవల్ Android GO 4G స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

ఇది 3G, 4G మరియు VoLTE లతో పాటుగా బ్లూటూత్ GPS మరియు WiFi వంటి కనెక్టివిటీ ఎంపికలను కూడా కలిగి ఉంటుంది.

ఇండియాలో విడుదలైన NOKIA C2 ఎంట్రీ లెవల్  Android GO 4G స్మార్ట్ ఫోన్

HMD గ్లోబల్, ఇండియాలోలోని బడ్జెట్ వినియోగదారులను టార్గెట్ చేసుకొని, ఎంట్రీ లెవల్  Android GO 4G స్మార్ట్ ఫోనుగా NOKIA C2 ను ప్రకటించింది. ఈ ఫోన్ను ఎంట్రీ లెవల్  Android GO 4G స్మార్ట్ ఫోనుగా విడుదల చేసినట్లు ప్రకటించినా కూడా ఈ ఫోన్ యొక్క ధరలను మాత్రం ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న పోటీకి అనుగుణంగా తక్కువ ధరకే ప్రకటించే అవకాశం ఉన్నట్లు మాత్రం ఊహించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

నోకియా C2 : ప్రత్యేకతలు

ఈ నోకియా C2 స్మార్ట్ ఫోన్ను ఒక 5.7 అంగుళాల పరిమాణం గల మరియు 720×1520 పిక్సెళ్ళు, అంటే HD రిజల్యూషన్ అందించగల డిస్ప్లేతో ప్రకటించింది. ఈ ఫోన్ 1.4GHz క్లాక్ స్పీడ్ అందించగల Unisoc క్వాడ్ కోర్ ప్రాసెసర్ యొక్క శక్తితో పనిచేస్తుంది మరియు ఆండ్రాయిడ్ 9.0 పై గోఎడిషన్ OS పైన నడుస్తుంది. దీనికి జతగా, 1GB ర్యామ్ మరియు 16GB అంతర్గత మెమొరీతో పాటుగా ఒక SD కార్డు ద్వారా 64GB వరకూ స్టోరేజిని పెంచుకునేలా సామర్ధ్యం కలిగివుంటుంది.

ఇక కెమేరాలు మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో వెనుక ఒక 5MP సింగిల్ కెమేరా మరియు ముందు కూడా 5MP సెల్ఫీ కెమేరానే కలిగి ఉంటుంది. ఇందులో ఒక ప్రత్యేకమైన Google Assistant బటన్ కూడా ఇవ్వబడింది. పూర్తి ఫోనుకు తగిన విధంగా ఒక 2,800 mAh బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇది 3G, 4G మరియు VoLTE లతో పాటుగా బ్లూటూత్ GPS మరియు WiFi వంటి కనెక్టివిటీ ఎంపికలను కూడా కలిగి ఉంటుంది.                                      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo