Android 16 Pixel: పిక్సెల్ ఫోన్స్ కోసం స్టేబుల్ అప్డేట్ రోల్ అవుట్ చేసిన గూగుల్.!
ఆండ్రాయిడ్ 16 స్టేబుల్ అప్డేట్ ను పిక్సెల్ ఫోన్స్ కోసం రోల్ అవుట్ చేసింది
గూగుల్ మేజర్ అప్డేట్స్ ను ఎప్పటి లాగానే గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కోసం ముందుగా రిలీజ్ చేసింది
ఈ కొత్త OS స్టేబుల్ అప్డేట్ గూగుల్ పిక్సెల్ యూజర్స్ కోసం ఇప్పుడు అందుబాటులో వుంది
Android 16 Pixel: గూగుల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 16 స్టేబుల్ అప్డేట్ ను పిక్సెల్ ఫోన్స్ కోసం రోల్ అవుట్ చేసింది. గూగుల్ మేజర్ అప్డేట్స్ ను ఎప్పటి లాగానే గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కోసం ముందుగా రిలీజ్ చేసింది. ఈ కొత్త అప్డేట్ ను ‘బక్లావా’ కోడ్ నేమ్ తో అందించింది. ఈ కొత్త OS స్టేబుల్ అప్డేట్ గూగుల్ పిక్సెల్ యూజర్స్ కోసం ఇప్పుడు అందుబాటులో వుంది.
SurveyAndroid 16 Pixel: అప్డేట్
గూగుల్ ప్రకారం, జూన్ 10 నుంచి ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం స్టేబుల్ అప్డేట్ ను పిక్సెల్ ఫోన్ కోసం రోల్ అవుట్ చేసింది. ఈ కొత్త అప్డేట్ ను OTA గూగుల్ పిక్సెల్ ఫోన్ యూజర్లు అప్డేట్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ ముందుగా గూగుల్ పిక్సెల్ ఫోన్ లకు అందించినా, త్వరలోనే శామ్సంగ్, వివో, వన్ ప్లస్ మరియు మరిన్ని బ్రాండ్ డివైజెస్ కు కూడా విరివిగా అందించే అవకాశం ఉంటుంది.
Android 16 Pixel: ఏ ఫోన్ లకు అందిస్తుంది?
ఈ కొత్త పీడిత ను గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ను సి మొదలుకొని లేటెస్ట్ గా విడుదలైన అన్ని ఫోన్ లకు అందిస్తుంది. అంటే, గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లు మొదలుకొని రీసెంట్ గా విడుదలైన పిక్సెల్ 9a వరకు అన్ని ఫోన్లు కూడా ఈ అప్డేట్ అందుకోవడానికి అర్హత కలిగి ఉంటాయి.
Also Read: Monsoon Days Sale: అమెజాన్ సేల్ నుంచి భారీ రిఫ్రిజిరేటర్ డీల్స్ అందుకోండి.!
ఆండ్రాయిడ్ 16 అప్డేట్ కొత్త ఫీచర్స్ ఏమిటి?
ఆండ్రాయిడ్ 16 అప్డేట్ తో చాలా కొత్త ఫీచర్స్ మరియు యూజర్ కు అనువైన సర్దుబాట్లు చేసింది. ఇందులో ముఖ్యంగా లైవ్ అప్డేట్ మరియు సెక్యూరిటీ ప్రొటక్షన్ కోసం అందించిన అడ్వాన్స్డ్ ఫీచర్స్ గురించి చెప్పుకోవచ్చు. గూగుల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 16 తో ఐఫోన్ మాదిరి రైడ్స్ మరియు ఫుడ్ డెలివరీల కోసం రియల్ టైమ్ నోటిఫికేషన్ లను జత చేసింది. ఇది లాక్ స్క్రీన్ పై కూడా నోటిఫికేషన్ మరియు అప్డేట్ లను అందిస్తుంది.

ఆండ్రాయిడ్ 16 తో బిల్ట్ ఇన్ స్కామ్ మరియు మాల్వేర్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిన ఆన్లైన్ స్కామ్ లకు చెక్ పెట్టడానికి ఇది సహాయం చేస్తుంది. ఇది మాత్రమే కాదు బయోమెట్రిక్ డేటా మరియు సున్నితమైన ఆపరేషన్స్ కోసం ఇది అధిక సెక్యూరిటీ అందిస్తుంది. ఇందులో కెమెరా కూడా గూగుల్ పెద్ద పీట వేసింది. ఇందులో గూగుల్ ఫోటోస్ తో ఆన్ డివైజ్ AI ఎడిటింగ్ ఫీచర్స్ ను జత చేసింది. అదనంగా ఇందులో కొత్త UI అప్డేట్స్ మరియు స్లయిడర్ కోసం కొత్త హాప్టిక్ కంట్రోల్స్ కూడా తీసుకు వచ్చింది.