Google Pixel 4 A లాంచ్ డేట్ ఫిక్సయ్యింది

Google Pixel 4 A లాంచ్ డేట్ ఫిక్సయ్యింది
HIGHLIGHTS

Google Pixel 4 A ను ఆగస్టు 3 న లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Pixel 4 A స్మార్ట్ ఫోన్ గొప్ప స్పెక్స్ తో, వన్ ప్లస్ నార్డ్, రియల్ మీ ఎక్స్ 3 సూపర్ జూమ్ మరియు ఇదే విభాగంలో ఉన్న స్మార్ట్ ఫోన్లకు పోటీగా మిడ్-రేంజ్ విభాగంలోకి ప్రవేశిస్తుంది.

కెమేరా ప్రియులను అమితంగా ఆకట్టుకునే గూగుల్ పిక్సెల్ సిరీస్ స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురు చూసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పుడు వారికోసం ఒక గుడ్ న్యూస్, Google Pixel 4 A లాంచ్ గురించి తన వెబ్ ‌సైట్ మరియు అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ నుండి ఈ ఫోన్‌ లాంచ్ గురించి టీజ్ చేయడం ప్రారంభించింది. ఈ Pixel 4 A ను ఆగస్టు 3 న లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Pixel 3 A తరువాత చాలా కాలంగా గూగుల్ ఎటువంటి ఫోన్ను విడుదల చెయ్యలేదు. అందుకే, ఈ Pixel ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వారు “గూగుల్ జస్ట్ వాట్ యు వెయిటింగ్ ఫర్ ఫోన్” ఈ టీజింగ్ తమ్ కోసమే సూచనగా ఇస్తోందని భావిస్తున్నారు. గూగుల్ I / O 2020 సమయంలో ఈ Pixel 4 A ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిసింది. కానీ, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వర్చువల్ లాంచ్ ద్వారా ఇప్పుడు విడుదల అవుతుంది.

COVID-19 కారణంగా లాంచ్ ఆలస్యం అయింది. కానీ, గూగుల్ పిక్సెల్ 4 ఎ ఆగస్టు 3, సోమవారం ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది మరియు భారతదేశంలో కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే, ముందుగా వచ్చిన ఈ Pixel 4 ని మాత్రం భారతదేశంలో లాంచ్ చెయ్యలేదు.కానీ, ఈ సారి మాత్రం ఈ Pixel 4 A స్మార్ట్ ఫోన్ గొప్ప స్పెక్స్ తో, వన్ ప్లస్ నార్డ్, రియల్ మీ ఎక్స్ 3 సూపర్ జూమ్ మరియు ఇదే విభాగంలో ఉన్న స్మార్ట్ ఫోన్లకు పోటీగా మిడ్-రేంజ్ విభాగంలోకి ప్రవేశిస్తుంది. గూగుల్ యొక్క రాబోయే ఈ ఈ Pixel 4 A స్మార్ట్‌ ఫోన్ గురించి గతంలో అనేక లీక్స్ కూడా వచ్చాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo