గూగుల్ పిక్సెల్ 3XL పైన Rs. 28,000 రూపాయల భారి తగ్గింపు

గూగుల్ పిక్సెల్ 3XL పైన Rs. 28,000 రూపాయల భారి తగ్గింపు
HIGHLIGHTS

భారతదేశంలో ఈ మొబైల్ ఫోన్ ధరలో రూ .28,000 రుపాయల తగ్గింపును అందించింది.

Google తన Google Pixel 3 XL మొబైల్ ఫోన్ను అక్టోబర్ 2018 లో ఇండియాలో విడుదల చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప డిస్కౌంట్ కూడా ప్రకటించింది.  ఎవరూ ఊహించని విధంగా ఫోన్ ధరలో 33% డిస్కౌంట్ ప్రకటించింది. అంటే, భారతదేశంలో ఈ మొబైల్ ఫోన్ ధరలో రూ .28,000 రుపాయల తగ్గింపును అందించింది.

ముందుగా, Rs. 83,000 ధరతో ఇండియాలో విడుదల చేయబడిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి వేరియంట్ పైన ఇప్పుడు 28,000 రూపాయల ధరను తగ్గించింది కాబట్టి, ఇప్పుడు కేవలం Rs.54,999 రుపాయల ధరకి అందుబాటులోవుంది.  ఈ ఫోన్ను ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా కొనుగోలు చేయదలచినవారు Flipkart నుండి కేవలం Rs.54,999 రుపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు.   

అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 4GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్ తీసుకోవాలనుకుంటే, మీరు Flipkart ద్వారా కేవలం రూ 65.999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇక మీరు Google పిక్సెల్ 3 XL మొబైల్ ఫోన్ను అమెజాన్ ఇండియా ద్వారా దాని బేస్ వేరియంట్ కొనాలనుకుంటే కేవలం రూ 55.478  ధరతో ఆన్లైన్ నుండి కొనుగోలు చేయవచ్చు.

గూగుల్ పిక్సెల్ 3XL ప్రత్యేకతలు

గూగుల్ పిక్సెల్ 3XL ఒక 6.3-అంగుళాల OLED డిస్ప్లేను కలిగివుంది, అది 1440 x 2960 పిక్సల్స్ యొక్క రిజల్యూషనుతో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 3XL క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసరుతో మద్దతు ఇస్తుంది, ఇది 4GB RAM మరియు 64GB/128GB అంతర్గత మెమరీతో కలుపుతుంది. ఇందులో స్టోరేజిని పెంచడానికి అవకాశంలేదు. ఈ స్మార్ట్ ఫోన్ ముందువైపు 8MP + 8MP డ్యూయల్ యూనిట్లతో పాటుగా ఫోను వెనుకభాగంలో 12.2 MP సెన్సార్ ఉంది. అయితే ఈ గూగుల్ ఫోన్లు అందించే కెమెరా నాణ్యత కారణంగా ఈ ఫోన్లన్నీ కూడా అత్యంత ప్రజాదరణ పొందాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo