Google Pixel 11 Pro launched with stunning look and features know the price and features
Google Pixel 11 Pro కంప్లీట్ కిల్లర్ లుక్ అండ్ ఫీచర్స్ తో వచ్చింది. గత జనరేషన్ ఫోన్స్ తో పోలిస్తే ఈ ఫోన్ మరింత గొప్ప లుక్ మరియు మరింత ప్రీమియం ఫీచర్స్ తో ఉంటుంది. గూగుల్ ఈ ఫోన్ ను ఈరోజు లాంచ్ చేయడంతో పాటు ఈ ఫోన్ ఇండియా ప్రైస్ అండ్ ఆఫర్స్ కూడా విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ వివరంగా చూద్దాం.
గూగుల్ ఈ ఫోన్ ను చాలా ప్రీమియం ధరలో లాంచ్ చేసింది. ఇక ప్రైస్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ బేసిక్ 12GB + 256GB వేరియంట్ ని రూ. 1,19,999 ధరతో మరియు ఈ ఫోన్ హై ఎండ్ 12GB + 512GB వేరియంట్ ను రూ. 1,34,999 రూపాయల ధరతో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కాన్యన్, ఆలీవ్, ఫాగ్ మరియు ఒడిసియన్ నాలుగు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ ను సైతం గూగుల్ ఈరోజు నుంచి ప్రారంభించింది. గూగుల్ స్టోర్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు.
ఇక గూగుల్ పిక్సెల్ 11 ప్రో పై అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై భారీ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ పై రూ. 10,000 రూపాయల వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ, 9,000 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ లను అందించింది. అంతేకాదు, అధిక నెలల No cost EMI ఆఫర్ ని కూడా అందించింది.
Also Read : Google Pixel 11: ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది .. ప్రైస్ ఎంతంటే.!
గూగుల్ ఈ ఫోన్ ను కూడా లేటెస్ట్ గూగుల్ యొక్క లేటెస్ట్ Tensor G6 చిప్ సెట్ మరియు ప్రత్యేకమైన Titan M3 security కో ప్రాసెసర్ తో అందించింది. ఈ ఫోన్ లో 12GB మరియు 16GB ర్యామ్ జతగా 256 / 512 GB స్టోరేజ్ ఆప్షన్ అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. పిక్సెల్ 11 ప్రో ఫోన్ లో 6.3 ఇంచ్ సూపర్ ఆక్టువా స్క్రీన్ ఉంటుంది. ఇది LTPO OLED మరియు 1–120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, HDR సపోర్ట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ ఫోన్ కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 50MP ఆక్టా PD మెయిన్ వైడ్ కెమెరా, 48MP క్వాడ్ PD అల్ట్రా వైడ్ మరియు 48MP క్వాడ్ PD టెలిఫోటో సెన్సార్ లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ లో 42 MP డ్యూయల్ PD సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 120x ప్రో జూమ్, మల్టీ జోన్ LDAF మరియు లేటెస్ట్ పిక్సెల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 24/30 FPS తో 8K వీడియో రికార్డింగ్ మరియు 24/30/60 FPS తో 4K వీడియోలు రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
గూగుల్ ఈ ఫోన్ లో 4,850 mAh బ్యాటరీ అందించింది. అలాగే, 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 25W వరకు పిక్సెల్ స్నాప్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది. ఇందులో బిల్ట్ ఇన్ గూగుల్ జెమినీ ఇంటెలిజెన్స్ మరియు ప్రీమియం సేఫ్టీ ఫీచర్లు కూడా అందించింది. ఈ ఫోన్ కూడా Android 17 OS తో లాంచ్ అయ్యింది మరియు 7 సంవత్సరాల OS అప్డేట్స్ తో పాటు రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా రిసీవ్ చేసుకుంటుంది.