Google Pixel 11: ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది .. ప్రైస్ ఎంతంటే.!

HIGHLIGHTS

స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎదురు చూస్తున్న గూగుల్ పికెల్ 11 సిరీస్ ను ఎట్టకేలకు గూగుల్ ఈరోజు విడుదల చేసింది

గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్ ఫోన్ ను సైతం భారీ ఫీచర్స్ తో విడుదల చేసింది

వేగవంతమైన Tensor G6 ప్రాసెసర్ మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందించింది

Google Pixel 11: ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది .. ప్రైస్ ఎంతంటే.!

Google Pixel 11: గత రెండు నెలలుగా ఎప్పుడెప్పుడా అని స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎదురు చూస్తున్న గూగుల్ పికెల్ 11 సిరీస్ ను ఎట్టకేలకు గూగుల్ ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ స్టార్టింగ్ వేరియంట్ అయిన గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్ ఫోన్ ను సైతం భారీ ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ ను వేగవంతమైన Tensor G6 ప్రాసెసర్ మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందించింది. ఈ లేటెస్ట్ గూగుల్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google Pixel 11: ప్రైస్

గత జనరేషన్ స్మార్ట్ ఫోన్ తో పోలిస్తే గూగుల్ పిక్సెల్ 11 ఫోను అధిక ధరలో లేదా ప్రీమియం ధరలో విడుదల చేసింది. అయితే, ఫీచర్స్ కూడా మరింత ప్రీమియం గా అందించింది. ఇక ఈ ఫోన్ రేటు విషయానికి వస్తే, గూగుల్ ఈ ఫోన్ స్టార్టింగ్ 12GB + 256GB వేరియంట్ ను రూ. 89,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ 12GB + 512GB వేరియంట్ ను రూ. 1,04,999 ప్రైస్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ ఫ్రాస్ట్, హైబిస్కస్, పిస్తాచియో మరియు ఒడిసియన్ నాలుగు రంగుల్లో లభిస్తుంది.

Google Pixel 11 price and offers

ఆఫర్స్

గూగుల్ ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ పై రూ. 7,000 రూపాయల వరకు ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ మరియు రూ. 9,000 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్స్ ను అందించింది. ఈరోజు నుంచి యూజర్లు ఈ ఫోన్ ను ప్రీ ఆర్డర్ చేసుకునే అవకాశం గూగుల్ అందించింది.

Also Read : Amazon Sale చివరి రోజు కేవలం రూ. 3,000 ప్రారంభ ధరలో 120 ఇంచ్ స్క్రీన్ అందించే ప్రొజెక్టర్ అందుకోండి.!

Google Pixel 11: ఫీచర్స్

గూగుల్ ఈ ఫోన్ ను భారీ స్పెక్స్ అండ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.3 ఇంచ్ యాక్టుగా డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది గ్ర`గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, 60–120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను గూగుల్ లేటెస్ట్ గా క్రియేట్ చేసిన పవర్ ఫుల్ చిప్ సెట్ Tensor G6 తో లాంచ్ చేసింది. దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ తో పాటు మరింత గొప్ప సెక్యూరిటీ కోసం Titan M3 security కో ప్రాసెసర్ ని కూడా అందించింది.

ఈ ఫోన్ లో 48MP Quad PD మెయిన్ వైడ్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ మరియు 10.8MP డ్యూయల్ PD టెలిఫోటో కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 10.5MP డ్యూయల్ PD సెల్ఫీ కెమెరా కోడోత్ ఉంది. ఈ ఫోన్ 24/30/60 FPS తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అలాగే, 10-bit HDR వీడియో, సినిమాటిక్ పాన్, యాక్టివ్ నాయిస్ స్టెబిలైజేషన్ మరియు లేటెస్ట్ గూగుల్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రత్యేకమైన పిక్సెల్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి వుంది.

గూగుల్ ఈ ఫోన్ ను లేటెస్ట్ Android 17 OS తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 7 సంవత్సరాల OS అప్డేట్స్ మరియు రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఎమర్జెన్సీ SOS, కార్ క్రాష్ డిటెక్షన్, ఆండ్రాయిడ్ ఎర్త్ క్వీక్ అలర్ట్ వంటి మరిన్ని ఎమర్జెన్సీ ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile