Google Pixel 11 Pro Fold సూపర్ స్లీక్ డిజైన్ మరియు అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. గత రెండు నెలలుగా ఈ ఫోన్ గురించి అనేక లీక్స్ మరియు అంచనా డీటెయిల్స్ తో నెట్టింట్లో న్యూస్ తెగ వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. లాంచ్ అవ్వడమే కాదు ఈ ఫోన్ ముందస్తు బుకింగ్ కూడా ఈరోజు గూగుల్ ప్రారంభించింది. ఈ ఫోన్ ధర చూస్తే మాత్రం మతిపోతుంది.
గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను సింగల్ వేరియంట్ తో రూ.1,86,999 రూపాయల ప్రీమియం ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కేవలం ఆలీవ్ సింగల్ వేరియంట్లలో లభిస్తుంది.
ఇక ఈ ఫోన్ గూగుల్ అందించిన ఆఫర్స్ చూస్తే, ఈ ఫోన్ పై రూ. 10,000 రూపాయల తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ తో పాటు రూ. 9,000 రూపాయల గొప్ప ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై 24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ కూడా గూగుల్ అందించింది.
Also Read : Google Pixel 11 Pro కంప్లీట్ కిల్లర్ లుక్ అండ్ ఫీచర్స్ తో వచ్చింది : ప్రైస్ అండ్ ఫీచర్స్ ఇవిగో.!
ఇది గూగుల్ అందించిన లేటెస్ట్ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ మరియు సాధారణ ఫోన్ తో పాటు పెద్ద స్క్రీన్ అవసరమయ్యే వారికి ఇది ఉపయోగకరంగా ఉండేలా రూపొందించబడింది. ఈ ఫోన్ వెలుపల 6.5 ఇంచ్ సూపర్ ఆక్టువా డిస్ప్లేని 3,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇందులో 8 ఇంచ్ బిగ్ సూపర్ ఆక్టువా ఫ్లెక్స్ డిస్ప్లే ఉంది. ఈ స్క్రీన్ 1–120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 3,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
డిజైన్ పరంగా ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు 10.1 mm మందంతో మరియు విప్పినప్పుడు కేవలం 5mm మందంతో మాత్రమే ఉంటుంది. ఇది పుస్తకం మాదిరి డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా గూగుల్ యొక్క సరికొత్త Tensor G6 ప్రాసెసర్ తో అందించింది. ఈ ఫోన్ లో 16GB ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ అందించింది. ఈ ఫోన్ లో కూడా Titan M3 security coprocessor ని అందించింది.
ఈ ఫోన్ అడ్వాన్స్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 48MP వైడ్, 10.5 MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో ఫోకస్ మరియు 10.8 MP టెలిఫోటో (5x) కెమెరాలు ఉంటాయి. ఇది 30x సూపర్ జూమ్, 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ పిక్సెల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 10MP అవుటర్ స్క్రీన్ కెమెరా మరియు లోపల స్క్రీన్ లో 10MP ఇన్నర్ కెమెరా ఉంటుంది. ఇవి కూడా లేటెస్ట్ ఏఐ కెమెరా మరియు ప్రీమియం గూగుల్ పిక్సెల్ ఫీచర్స్ కలిగి ఉంటాయి.
ఈ ఫోన్ లో 4806 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు 25W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అడ్వాన్స్డ్ గూగుల్ జెమినీ బిల్ట్ ఇన్ మరియు మరిన్ని ఏఐ ఫీచర్స్ కలిగి ఉంటుంది.