Google Pixel 11 Pro Fold సూపర్ స్లీక్ డిజైన్ మరియు అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.. ధర చూస్తే మతిపోతుంది.!

HIGHLIGHTS

Google Pixel 11 Pro Fold సూపర్ స్లీక్ డిజైన్ మరియు అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ ముందస్తు బుకింగ్ కూడా ఈరోజు గూగుల్ ప్రారంభించింది

ఈ ఫోన్ ధర చూస్తే మాత్రం మతిపోతుంది

Google Pixel 11 Pro Fold సూపర్ స్లీక్ డిజైన్ మరియు అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.. ధర చూస్తే మతిపోతుంది.!

Google Pixel 11 Pro Fold సూపర్ స్లీక్ డిజైన్ మరియు అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. గత రెండు నెలలుగా ఈ ఫోన్ గురించి అనేక లీక్స్ మరియు అంచనా డీటెయిల్స్ తో నెట్టింట్లో న్యూస్ తెగ వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. లాంచ్ అవ్వడమే కాదు ఈ ఫోన్ ముందస్తు బుకింగ్ కూడా ఈరోజు గూగుల్ ప్రారంభించింది. ఈ ఫోన్ ధర చూస్తే మాత్రం మతిపోతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google Pixel 11 Pro Fold : ప్రైస్

గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను సింగల్ వేరియంట్ తో రూ.1,86,999 రూపాయల ప్రీమియం ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కేవలం ఆలీవ్ సింగల్ వేరియంట్లలో లభిస్తుంది.

Google Pixel 11 Pro Fold price and features

ఆఫర్స్

ఇక ఈ ఫోన్ గూగుల్ అందించిన ఆఫర్స్ చూస్తే, ఈ ఫోన్ పై రూ. 10,000 రూపాయల తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ తో పాటు రూ. 9,000 రూపాయల గొప్ప ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై 24 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ కూడా గూగుల్ అందించింది.

Also Read : Google Pixel 11 Pro కంప్లీట్ కిల్లర్ లుక్ అండ్ ఫీచర్స్ తో వచ్చింది : ప్రైస్ అండ్ ఫీచర్స్ ఇవిగో.!

Google Pixel 11 Pro Fold : ఫీచర్స్

ఇది గూగుల్ అందించిన లేటెస్ట్ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ మరియు సాధారణ ఫోన్‌ తో పాటు పెద్ద స్క్రీన్ అవసరమయ్యే వారికి ఇది ఉపయోగకరంగా ఉండేలా రూపొందించబడింది. ఈ ఫోన్ వెలుపల 6.5 ఇంచ్ సూపర్ ఆక్టువా డిస్ప్లేని 3,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇందులో 8 ఇంచ్ బిగ్ సూపర్ ఆక్టువా ఫ్లెక్స్ డిస్ప్లే ఉంది. ఈ స్క్రీన్ 1–120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 3,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

డిజైన్ పరంగా ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు 10.1 mm మందంతో మరియు విప్పినప్పుడు కేవలం 5mm మందంతో మాత్రమే ఉంటుంది. ఇది పుస్తకం మాదిరి డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా గూగుల్ యొక్క సరికొత్త Tensor G6 ప్రాసెసర్ తో అందించింది. ఈ ఫోన్ లో 16GB ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ అందించింది. ఈ ఫోన్ లో కూడా Titan M3 security coprocessor ని అందించింది.

ఈ ఫోన్ అడ్వాన్స్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 48MP వైడ్, 10.5 MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో ఫోకస్ మరియు 10.8 MP టెలిఫోటో (5x) కెమెరాలు ఉంటాయి. ఇది 30x సూపర్ జూమ్, 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ పిక్సెల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 10MP అవుటర్ స్క్రీన్ కెమెరా మరియు లోపల స్క్రీన్ లో 10MP ఇన్నర్ కెమెరా ఉంటుంది. ఇవి కూడా లేటెస్ట్ ఏఐ కెమెరా మరియు ప్రీమియం గూగుల్ పిక్సెల్ ఫీచర్స్ కలిగి ఉంటాయి.

ఈ ఫోన్ లో 4806 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు 25W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అడ్వాన్స్డ్ గూగుల్ జెమినీ బిల్ట్ ఇన్ మరియు మరిన్ని ఏఐ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile